టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో శివ కార్తికేయన్ కు మంచి పేరు ఉంది. శివ కార్తికేయన్ నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించి నిర్మాతలకు మంచి స్థాయిలో లాభాలను అందుకున్నాయి. తన సినిమాలు ఆశించిన ఫలితాన్ని అందుకోకపోతే నిర్మాతలకు డబ్బులు వెనక్కు ఇచ్చి ఆదుకునే హీరోగా కూడా శివ కార్తికేయన్ కు పేరుంది. తాజాగా శివ కార్తికేయన్ చిన్న కొడుకు బారశాల వేడుక గ్రాండ్ గా జరిగింది.
కొన్ని నెలల క్రితం శివ కార్తికేయన్ దంపతులు మూడోబిడ్డకు జన్మించిన సంగతి తెలిసిందే. కొడుకు బారశాలకు సంబంధించిన వీడియో షేర్ చేసిన శివ కార్తికేయన్ కొడుకుకు పవన్ అనే పేరు పెట్టానని వెల్లడించారు. అదే సమయంలో శివ కార్తికేయన్ భార్య గురించి చెబుతూ ఎమోషనల్ కాగా అతను చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
“ఆర్తి.. ఆపరేషన్ థియేటర్ లో పిల్లల్ని కనే సమయంలో నువ్వు ఎంత నరకం చూశావో నేను కళ్లారా చూశాను.. ఆ బాధను భరిస్తూ నాకు అందమైన ప్రపంచాన్ని ఇచ్చినందుకు ఎప్పటికీ నీకు కృతజ్ఞుడినై ఉంటాను.. లవ్ యూ” అంటూ ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ లో పేర్కొన్నారు. చివర్లో ఆరాధాన గుగన్ పవన్ అంటూ తన ముగ్గురు పిల్లల పేర్లను శివ కార్తికేయన్ పోస్ట్ లో రాసుకొచ్చారు.
2010 సంవత్సరంలో శివ కార్తికేయన్ ఆర్తిల పెళ్లి జరిగింది. ఆర్తి శివ కార్తికేయన్ బంధువుల అమ్మాయి కావడం గమనార్హం. ఈ దంపతులకు 2013 సంవత్సరంలో ఆరాధన జన్మించగా 2021 సంవత్సరంలో గుగన్ జన్మించాడు. కొన్ని నెలల క్రితం ఆర్తి పండంటి మగబిడ్డకు జన్మనివ్వగా ఆ బిడ్డకు పవన్ అని నామకరణం చేశారు. టాలీవుడ్ స్టార్ హీరో పేరును శివ కార్తికేయన్ తన కొడుకుకు పెట్టాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.