ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కి ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేసుకున్న రాధేశ్యామ్ సినిమా రిలీజ్ డేట్ రెండుసార్లు వేర్వేరు కారణాల వల్ల వాయిదా పడింది. ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కగా రాధేశ్యామ్ సినిమాను ఈ ఏడాది మార్చి 11వ తేదీన రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ రిలీజ్ డేట్ సరైన రిలీజ్ డేట్ కాదని ప్రభాస్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.
మార్చి 11వ తేదీన రాధేశ్యామ్ సినిమాను విడుదల చేయడం వల్ల కలెక్షన్ల విషయంలో ఈ సినిమా భారీగా నష్టపోయే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు. రాధేశ్యామ్ కు రెండు వారాల ముందు భీమ్లా నాయక్ రెండు వారాల తర్వాత ఆర్ఆర్ఆర్ సినిమాలు షెడ్యూల్ అయ్యాయి. భీమ్లా నాయక్ ఫిబ్రవరి 25వ తేదీనే విడుదలైతే రాధేశ్యామ్ కు భారీ స్థాయిలో థియేటర్లు దొరికే ఛాన్స్ అయితే ఉండదని చెప్పవచ్చు.
మార్చి నెలలో తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు పరీక్షలు జరుగుతాయి. పరీక్షల వల్ల రాధేశ్యామ్ కు హిట్ టాక్ వచ్చినా విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఈ సినిమాకు దూరంగా ఉండే అవకాశాలు అయితే ఉంటాయి. ఆర్ఆర్ఆర్ విడుదలైతే రాధేశ్యామ్ థియేటర్లను దాదాపుగా కోల్పోయే ఛాన్స్ ఉంటుంది. మరోవైపు కర్ణాటకలో మార్చి 17వ తేదీ నుంచి మార్చి 23వ తేదీ వరకు పునీత్ రాజ్ కుమార్ జేమ్స్ మూవీని మాత్రమే థియేటర్లలో ప్రదర్శించనున్నారు.
ఈ విధంగా కర్ణాటకలో కూడా రాధేశ్యామ్ మూవీ నష్టపోయే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు. తమిళంలో మార్చి 10వ తేదీన సూర్య నటించిన ఈటీ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమా వల్ల తమిళంలో రాధేశ్యామ్ కు ఎక్కువ థియేటర్లు దొరికే ఛాన్స్ అయితే లేదు. రాధేశ్యామ్ రిలీజ్ డేట్ విషయంలో మేకర్స్ తప్పు చేశారని కామెంట్లు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ సినిమా మేకర్స్ ఏ విధంగా వ్యవహరిస్తారో చూడాల్సి ఉంది.