దర్శకుడు ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన మగధీర ఆల్ టైం బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా ఉంది. రామ్ చరణ్, కాజల్ అగర్వాల్ జంటగా తెరకెక్కిన సోషియో ఫాంటసీ లవ్ డ్రామా రికార్డుల తిరగరాసింది. ఐతే ఈ చిత్రంలోని ఓ సన్నివేశాన్ని ఓ ప్రొఫెసర్ తన పాఠం కోసం వాడేశాడు. ఓ సాఫ్ట్ వేర్ పనిచేసే విధానం స్టూడెంట్స్ కి అర్థం అయ్యేలా చెప్పడానికి ఏకంగా వీడియో వేసి వివరించారు. మగధీర మూవీలో చరణ్ ని కాజల్ ఓ సంధర్భంలో అపార్థం చేసుకుంటుంది.
అదే సమయంలో విలన్స్ ఆమెను హెలికాప్టర్ లో కిడ్నాప్ చేసి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. కాజల్ ని కాపాడడం కోసం రౌడీలను తప్పించుకుంటూ గాల్లో ఉన్న హెలికాప్టర్ పైకి జంప్ చేస్తాడు రామ్ చరణ్. ఈ సన్నివేశంలో చరణ్ ని ఓ ఎస్ అని (ఆపరేటింగ్ సిస్టమ్) ఆయన వెతుకున్న కాజల్ మెయిన్ మెథడ్ అని, అడ్డుకుంటున్న వాళ్ళు జావా అని చెప్పాడు. ఎంత మంది అడ్డుకున్నా చరణ్, కాజల్ చేతిని తాకి గతజన్మ జ్ఞాపకాలు గుర్తు చేస్తాడు.
ఈ సందర్భాని ఎంతో పవర్ ఫుల్ సాఫ్ట్ వేర్ అయినా ఓ ఎస్ మెయిన్ మెథడ్ కి చెప్పాల్సిన సందేశం చెప్పేసిందని సదరు ప్రొఫెసర్ వర్ణించాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది. పాటాలు చెప్పడానికి కొత్త పద్దతిని ఎంచుకున్న ఆ ప్రొఫెసర్ ఎవరని అందరూ సెర్చ్ చేస్తున్నారు. సినిమా మంచి చేస్తుంది అనడానికి ఇది ఒక నిదర్శనం అనుకోవచ్చు.