సినిమాల్లో సోనూ సూద్ ను విలన్ గా చూపిస్తారు.. కానీ హీరోలను డామినేట్ చేసే గ్లామర్, ఫిజిక్ అతని సొంతం. అందుకే అతనికి ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ‘విలన్ గా నటించే వ్యక్తికి కూడా ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందా’ అని కామెంట్స్ చేసే వారికి ఇతని ఫ్యాన్ ఫాలోయింగ్ ను చూపిస్తే మతిపోవడం ఖాయం. ఇదిలా ఉంటే.. సినిమాల్లో విలన్ అయినప్పటికీ.. రియల్ లైఫ్ లో మాత్రం హీరో అనిపించుకున్నాడు సోనూ సూద్. లాక్ డౌన్ కారణంగా తమ స్వస్థలాలకు వెళ్ళలేక ఇబ్బంది పడుతున్న ఏంతో మంది కార్మికులను ఆదుకున్నాడు. తన సొంత ఖర్చుతో వారిని ఇళ్ళకు పంపే ఏర్పాట్లు చేసాడు.
బస్సు, ట్రైన్ సర్వీసులు ఏర్పాటు చెయ్యడంతో పాటు మహిళల కోసం ప్రత్యేక విమాన సదుపాయాన్ని కూడా కల్పించాడు. అయితే సోనూ సూద్ కు పోలీసులు పెద్ద షాక్ ఇచ్చారట.అదేంటంటే.. తాను ఏర్పాటు చేసిన రైలు వద్దకు వెళ్ళి కార్మికులను కలుసుకోవాలని ప్రయత్నించిన సోనూ సూద్ ను పోలీసులు ఆపేశారట. ఆ విషయం పై సోనూ సూద్ స్పందిస్తూ…”ముంబయిలో ఉన్న కార్మిక సోదరులకు ప్రత్యేక రైలును ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాను.ఆ విషయం పై వారు వెంటనే స్పందించి బాంద్రా నుండీ గోరఖ్‌పూర్‌కు రైలును ఏర్పాటు చేశారు.
దీనికి ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వారి సహాయం లేనిదే ఇది నాకు సాధ్యమయ్యేది కాదు. కార్మిక సోదరులను కలిసేందుకు వెళితే నన్ను… ప్లాట్‌ఫాం వద్ద ఆపేసారు. రద్దీని నివారించేందుకే నన్ను అక్కడ అడుగుపెట్టనివ్వలేదు. అయితే నాకు కావాల్సింది.. ‘నేను ప్లాట్‌ఫాం మీదకు వెళ్ళడం కాదు… వలస సోదరులు వారి ఇళ్ళకు వెళ్ళడం’. నన్ను స్టేషన్‌లోకి అనుమతించక పోయినా ప్రాబ్లెమ్ లేదు. నేను రూల్స్ ను పాటిస్తాను. నేను వారిని ప్లాట్‌ఫాం వద్ద కలవలేకపోయినా… బయట కలిసాను. అది చాలు నాకు” అంటూ చెప్పుకొచ్చాడు.