సినిమాలు, రాజకీయాలు రెండూ వేర్వేరు రంగాలు కాగా ఈ రెండు రంగాలలో సక్సెస్ సాధించడం సులువైన విషయం కాదు. ఎంతో కష్టపడితే మాత్రమే ఈ రెండు రంగాల్లో ఆశించిన ఫలితాలను సొంతం చేసుకోవడం సాధ్యమవుతుంది. రాజకీయాల్లో కీలక పదవిలో ఉండి సినిమాల్లో నటించడం సులువు కాదు. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ (Sr NTR) సీఎంగా ఉన్న సమయంలోనే శ్రీనాథ కవి సార్వభౌముడు అనే సినిమాలో నటించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) డిప్యూటీ సీఎం పదవిలో ఉండి మంత్రిగా కీలక శాఖలకు సంబంధించిన బాధ్యతలను నిర్వహిస్తూ త్వరలో షూటింగ్ లలో పాల్గొన్నారు.
పవన్ కళ్యాణ్ రాజకీయాలకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నా సినిమాల పరంగా ఆయన క్రేజ్ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదనే సంగతి తెలిసిందే. సినిమాల నుంచి పాలిటిక్స్ లోకి వచ్చి పాలిటిక్స్ లో సక్సెస్ అయ్యాక సినిమాల్లో నటించడం అప్పుడు సీనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు పవన్ కు సాధ్యమైందని కామెంట్లు వినిపిస్తున్నాయి. రెండు రంగాల్లో సక్సెస్ సాధించిన విషయంలో సీనియర్ ఎన్టీఆర్ ను పవన్ కళ్యాణ్ గుర్తు చేస్తున్నారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
పవన్ పొలిటికల్ గా సాధించిన విజయాలు ఏపీ రాజకీయ చరిత్రలో నిలిచిపోతాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. భవిష్యత్తులో పవన్ పార్టీ పోటీ చేసే స్థానాల సంఖ్య సైతం పెరగనుందని ప్రచారం జరుగుతుండటం గమనార్హం. పవన్ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్ లను థియేటర్లలో రిలీజ్ చేస్తే ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవు.
హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu) పార్ట్1 విడుదలైతే పార్ట్2 గురించి స్పష్టత వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. క్రిష్ (Krish Jagarlamudi) ఈ సినిమా నుంచి తప్పుకున్న నేపథ్యంలో ఈ సినిమా ఫలితం ఏ విధంగా ఉండబోతుందనే చర్చ జరుగుతోంది. పవన్ ఈరోజు నుంచి మంత్రిగా బాధ్యతలు స్వీకరించనుండటం గమనార్హం.