శర్వానంద్ ,ప్రియాంకా అరుళ్ మోహన్ జంటగా నటించిన తాజా చిత్రం ‘శ్రీకారం’. కిశోర్.బి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 11న శివరాత్రి కానుకగా విడుదలయ్యింది. మొదటి షో నుండీ ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. మంచి మెసేజ్ ఉంది..ఒకసారి చూడొచ్చు అని కొంత మంది ప్రేక్షకులు పాజిటివ్ కామెంట్లు చేసినప్పటికీ.. టికెట్ రేట్లు పెంచెయ్యడం వలన ప్రేక్షకులు ఈ చిత్రాన్ని లైట్ తీసుకున్నారు. మొదటి రోజు పర్వాలేదు అనిపించిన ఈ చిత్రం కలెక్షన్లు ఆ తరువాత నుండీ తగ్గుతూ వస్తున్నాయి.
ఇక ఈ చిత్రం 9 రోజుల కలెక్షన్ల వివరాలను ఓ సారి పరిశీలిస్తే :
నైజాం | 2.78 cr |
సీడెడ్ | 1.61 cr |
ఉత్తరాంధ్ర | 1.19 cr |
ఈస్ట్ | 0.74 cr |
వెస్ట్ | 0.51 cr |
గుంటూరు | 0.98 cr |
కృష్ణా | 0.52 cr |
నెల్లూరు | 0.33 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 8.66 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.30 cr |
ఓవర్సీస్ | 0.42 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 9.38 cr |
‘శ్రీకారం’ చిత్రానికి 17.1 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది కాబట్టి.. బ్రేక్ ఈవెన్ కు 17.5కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.9 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం కేవలం 9.38 కోట్ల షేర్ ను రాబట్టింది. అంటే బ్రేక్ ఈవెన్ కు ఇంకా 7.62 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఒక్క ‘జాతి రత్నాలు’ మినహా.. నిన్న విడుదలైన సినిమాలు అన్నీ ప్లాప్ లు అయ్యాయి. అయినప్పటికీ ఈ చిత్రానికి థియేటర్లు చాలా తక్కువగా ఉన్నాయి. ఒకవేళ ఈ చిత్రానికి కూడా థియేటర్లు ఉండి ఉంటే.. ఈ వీకెండ్ క్యాష్ చేసుకునే అవకాశం ఉండేది.
Click Here To Read Movie Review
Most Recommended Video
చావు కబురు చల్లగా సినిమా రివ్యూ & రేటింగ్!
మోసగాళ్ళు సినిమా రివ్యూ & రేటింగ్!
శశి సినిమా రివ్యూ & రేటింగ్!