Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » ఇంటర్వ్యూలు » Sri Simha Interview: మత్తువదలరా సీక్వెల్ కచ్చితంగా హిట్ కొడుతుంది అనే నమ్మకం ఉంది.!

Sri Simha Interview: మత్తువదలరా సీక్వెల్ కచ్చితంగా హిట్ కొడుతుంది అనే నమ్మకం ఉంది.!

  • September 9, 2024 / 05:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sri Simha Interview: మత్తువదలరా సీక్వెల్ కచ్చితంగా హిట్ కొడుతుంది అనే నమ్మకం ఉంది.!

ప్రఖ్యాత సంగీత దర్శకుడు కీరవాణి కుమారుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన కథానాయకుడు శ్రీ సింహా కోడూరి(Sri Simha Koduri ),. 2019లో వచ్చిన “మత్తు వదలరా” (Mathu Vadalara)  చిత్రంతో తెరంగేట్రం చేసి మంచి హిట్ కొట్టడంతోపాటు హీరోగానూ మంచి మార్కులు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన సినిమాలు కాస్త నిరాశపరిచినా హీరోగా మాత్రం వరుస అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు తనకు హిట్ ఇచ్చిన మొదటి చిత్రమైన “మత్తు వదలరా” సీక్వెల్ తో ప్రేక్షకుల్ని సెప్టెంబర్ 13న పలకరించడానికి సన్నద్ధమవుతున్నాడు శ్రీ సింహా కోడూరి. విడుదల సందర్భంగా మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు అతడి మాటల్లోనే..!!

Sri Simha

అందుకే సైలెంట్ గా షూట్ చేసాం..

“మత్తు వదలరా” రిలీజ్ టైమ్ కి సీక్వెల్ ఆలోచన లేదు. కానీ రిజల్ట్ తర్వాత చేద్దామనుకున్నాం. కానీ కోవిడ్ తర్వాత ఆ ఆలోచన కార్యరూపం దాల్చడం మొదలెట్టింది. అలాగని.. సినిమా ఎనౌన్స్ చేసి తర్వాత షూటింగ్ మొదలుపెట్టి.. విడుదల వరకు ఆ బజ్ ను మెయింటైన్ చేయడం చాలా కష్టం. అందుకే “మత్తు వదలరా 2” షూటింగ్ అంతా పూర్తయ్యాక విడుదలకు రెండు వారాల ముందు ఎనౌన్స్ చేశాం. ఫస్ట్ పార్ట్ హిట్ అవ్వడం వల్ల ఈ సినిమాకి మంచి బజ్ క్రియేట్ అయ్యింది. అది కచ్చితంగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాం.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 గొప్ప మనసు చాటుకున్న టాలీవుడ్ స్టార్స్.. చిరు టు విశ్వక్ సేన్ ఎంతెంత ఇచ్చారంటే?
  • 2 'బిగ్ బాస్ 8'.. 14 మంది కంటెస్టెంట్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్..!
  • 3 షారుఖ్ టు బన్నీ.. టాప్ 15 హైయెస్ట్ ట్యాక్స్ పేయర్స్ లిస్ట్

మీమ్స్ నాలెడ్జ్ లేకపోయినా మా సినిమా చూసి నవ్వుకుంటారు..

డైరెక్టర్ రితేష్ రాణా సినిమాలో మీమ్స్ ను ప్రెజెంట్ చేస్తుంటాడు. అయితే.. ఈ సినిమాలో మీమ్స్ అనేవి కామెడీ ఎలివేట్ చేయడానికి మాత్రమే ఉంటాయి కానీ ఎక్కడా కూడా మీమ్స్ తోనే సన్నివేశాలు రాసుకోలేదు. అందువల్ల అసలు ఇంటర్నెట్ తో సంబంధం లేని వారిని సినిమాకి తీసుకొచ్చినా వాళ్ళు హ్యాపీగా నవ్వుకుంటారు.

రాజమౌళి బాబాయ్ వల్ల ఎలాంటి ప్రెజర్ ఉండదు..

చాలామంది అడుగుతూ ఉంటారు రాజమౌళి (S. S. Rajamouli) కుటుంబం నుంచి వచ్చేసరికి అందరూ ఆయనతో కంపేర్ చేస్తుంటారు కదా అని. నిజమే కానీ.. నేను ఎప్పడు ప్రెజర్ లా ఫీల్ అవ్వలేదు. ఆయన ఇన్వాల్వెంట్ నా సినిమాల విషయంలో ఉండదు. షూటింగ్ కి ముందు ప్రమోషనల్ కంటెంట్ మాత్రమే ఆయనకు చూపిస్తాం. ఆయనకు నిజంగానే నచ్చితేనే ఒక ట్వీట్ వేయడం గట్రా చేస్తారు, లేదంటే అది కూడా ఉండదు. సో ఆయన ఇమేజ్ అనేది నాకెప్పుడూ ఇబ్బంది కలిగించలేదు.

ప్రభాస్ కి ట్రైలర్ విపరీతంగా నచ్చేసింది..

“మత్తు వదలరా 2” ట్రైలర్ ను ప్రభాస్ గారితో ఫార్మల్ గా రిలీజ్ చేయించేద్దాం అనుకున్నాం కానీ.. ఆయనకు ట్రైలర్ నచ్చి ఆయనే చాలా ఇన్వాల్వ్ అయ్యి వీడియో కూడా చేసారు. ఆయనకి విపరీతంగా నచ్చితే తప్ప అంతగా ఇన్వాల్వ్ అవ్వరు. ఆయన మా సినిమా ట్రైలర్ రిలీజ్ చేయడం వల్ల విపరీతమైన రీచ్ వచ్చింది.

సత్య నన్ను డామినేట్ చేసినా పర్లేదు..

సత్య (Satya)  కామెడీ టైమింగ్ మాములుగా ఉండదు. ఫస్ట్ పార్ట్ కంటే ఈ సెకండ్ పార్ట్ లో సత్య స్క్రీన్ టైమ్ ఎక్కువ ఉంటుంది. అయితే.. సినిమాలో ఆయన నన్ను డామినేట్ చేసేస్తాడని వచ్చే కామెంట్స్ కు నేను పెద్దగా పట్టించుకోను. ఎందుకంటే.. సినిమాకి ఏది వర్కవుటయితే ఆది చేస్తాం కానీ.. నా స్క్రీన్ ప్రెజన్స్ తక్కువ ఉంది, వాళ్లది ఎక్కువ ఉంది అని లెక్కలేసుకుంటూ కూర్చుంటే సినిమా తీయలేం.

ఒక్కో ఫ్లాప్ ఒక్కో పాఠాన్ని నేర్పింది..

కెరీర్ మొదలుపెట్టిన ఇన్నేళ్లలో చాలా ఫ్లాప్స్ చూశాను. అయితే.. ప్రతి సినిమా నుంచి ఏదో ఒకటి నేర్చుకున్నాను. ముఖ్యంగా ఫ్లాప్ సినిమాల నుండి ఎక్కడ తప్పు చేసాను, ఏ విషయంలో ఇంకా ఇంప్రూవ్ అవ్వచ్చు వంటి విషయాలు తెలుసుకున్నాను. సో, ప్రతి సినిమా నుంచి కొత్తగా ఏమైనా నేర్చుకున్నానే తప్ప ఇది అనవసరంగా చేసాను అని ఎప్పడు అనుకోలేదు.

ఆ విషయంలో మైత్రీ మూవీ మేకర్స్ ను మెచ్చుకోవాలి..

ఒక పక్క “పుష్ప 2” (Pushpa 2) లాంటి భారీ సినిమాలు తీస్తూనే మరో పక్క “మత్తు వదలరా 2” లాంటి చిన్న కాన్సెప్ట్ సినిమాలను ఎంకరేజ్ చేస్తున్నందుకు మైత్రీ మూవీ మేకర్స్ ను మెచ్చుకోవాలి. పార్ట్ 1 కంటె పార్ట్ 2 కోసం ఇంకా ఎక్కువ ఖర్చు చేసారు. కథను నమ్మి ఇంతలా ఖర్చు చేసారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Interviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Faria Abdullah
  • #Kaala Bhairava
  • #Mathu Vadalara 2
  • #Ritesh Rana
  • #satya

Also Read

Nithiin: నితిన్ ని తప్పించి విజయ్ ని పెట్టుకున్నారా?

Nithiin: నితిన్ ని తప్పించి విజయ్ ని పెట్టుకున్నారా?

‘K-RAMP’ Twitter Review:  K ర్యాంప్ మూవీ ట్వీట్టర్ రివ్యూ!

‘K-RAMP’ Twitter Review: K ర్యాంప్ మూవీ ట్వీట్టర్ రివ్యూ!

Dude Movie: ‘డ్యూడ్’ మూవీ తెలుగు థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Dude Movie: ‘డ్యూడ్’ మూవీ తెలుగు థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Telusu Kada Movie: ‘తెలుసు కదా’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Telusu Kada Movie: ‘తెలుసు కదా’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kantara Chapter 1 Collections: ‘కాంతార చాప్టర్ 1’కి.. ఇంకో వీకెండ్ ఛాన్స్ ఉంది.. ఏమవుతుందో ఇక

Kantara Chapter 1 Collections: ‘కాంతార చాప్టర్ 1’కి.. ఇంకో వీకెండ్ ఛాన్స్ ఉంది.. ఏమవుతుందో ఇక

King 100: ‘కింగ్ 100’ లో అనుష్క

King 100: ‘కింగ్ 100’ లో అనుష్క

related news

Mithra Mandali First Review: మిత్రమండలి’ ఫస్ట్ రివ్యూ.. బాక్సాఫీస్ వద్ద సిక్సు కొట్టేలా ఉందా?

Mithra Mandali First Review: మిత్రమండలి’ ఫస్ట్ రివ్యూ.. బాక్సాఫీస్ వద్ద సిక్సు కొట్టేలా ఉందా?

Bad Boy Karthik Teaser Review: ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ టీజర్ రివ్యూ.. ‘ఇలాంటి డైలాగులు అవసరమా నీకు’

Bad Boy Karthik Teaser Review: ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ టీజర్ రివ్యూ.. ‘ఇలాంటి డైలాగులు అవసరమా నీకు’

trending news

Nithiin: నితిన్ ని తప్పించి విజయ్ ని పెట్టుకున్నారా?

Nithiin: నితిన్ ని తప్పించి విజయ్ ని పెట్టుకున్నారా?

3 hours ago
‘K-RAMP’ Twitter Review:  K ర్యాంప్ మూవీ ట్వీట్టర్ రివ్యూ!

‘K-RAMP’ Twitter Review: K ర్యాంప్ మూవీ ట్వీట్టర్ రివ్యూ!

4 hours ago
Dude Movie: ‘డ్యూడ్’ మూవీ తెలుగు థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Dude Movie: ‘డ్యూడ్’ మూవీ తెలుగు థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

12 hours ago
Telusu Kada Movie: ‘తెలుసు కదా’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Telusu Kada Movie: ‘తెలుసు కదా’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

12 hours ago
Kantara Chapter 1 Collections: ‘కాంతార చాప్టర్ 1’కి.. ఇంకో వీకెండ్ ఛాన్స్ ఉంది.. ఏమవుతుందో ఇక

Kantara Chapter 1 Collections: ‘కాంతార చాప్టర్ 1’కి.. ఇంకో వీకెండ్ ఛాన్స్ ఉంది.. ఏమవుతుందో ఇక

12 hours ago

latest news

Bandla Ganesh, Bunny Vasu: బన్నీ వాస్ పై బండ్ల గణేష్ సెటైర్లు!

Bandla Ganesh, Bunny Vasu: బన్నీ వాస్ పై బండ్ల గణేష్ సెటైర్లు!

12 hours ago
Mithra Mandali Collections: నిరాశపరిచిన ‘మిత్రమండలి’ ఫస్ట్ డే కలెక్షన్స్!

Mithra Mandali Collections: నిరాశపరిచిన ‘మిత్రమండలి’ ఫస్ట్ డే కలెక్షన్స్!

12 hours ago
Jatadhara Trailer: ‘జటాధర’ ట్రైలర్ రివ్యూ.. సుధీర్ బాబుకి హిట్టు పడేలా ఉంది!

Jatadhara Trailer: ‘జటాధర’ ట్రైలర్ రివ్యూ.. సుధీర్ బాబుకి హిట్టు పడేలా ఉంది!

13 hours ago
కన్ఫ్యూజ్ అయ్యి ‘ఆర్య’ కి బదులు ‘ఆర్య 2’ తీసేశాడా?

కన్ఫ్యూజ్ అయ్యి ‘ఆర్య’ కి బదులు ‘ఆర్య 2’ తీసేశాడా?

13 hours ago
K-RAMP: 3 ఔట్.. ఇప్పుడు అందరి చూపు కిరణ్ పైనే..!

K-RAMP: 3 ఔట్.. ఇప్పుడు అందరి చూపు కిరణ్ పైనే..!

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version