దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ‘సీతారామం’ చిత్రం నిన్న(ఆగస్టు 5న) విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీని ‘వైజయంతి మూవీస్’ సమర్పణలో ‘స్వప్న సినిమా’ పతాకంపై అశ్వినీ దత్ నిర్మించారు. ఈ చిత్రంలో రామ్ పాత్రలో దుల్కర్,సీత పాత్రలో మృణాల్ అద్భుతంగా నటించారు అనే చెప్పాలి. దుల్కర్ ఎలాగూ తెలుగులో బిజీ అయిపోయాడు. ఇప్పుడు మృణాల్ కూడా టాలీవుడ్లో బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఇదిలా ఉండగా.. ‘సీతా రామం’ చిత్రంలో సీత పాత్రకు ముందుగా పూజాహెగ్డేను సంప్రదించినట్లు ప్రచారం జరుగుతుంది. పూజా హెగ్డే ని సంప్రదించిన మాట నిజమే కానీ.. ఆమెను తీసుకోవాలి అనుకున్నది సీత పాత్ర కోసం కాదు. రష్మిక చేసిన అఫ్రిన్ పాత్ర కోసం. అవును అఫ్రిన్ పాత్ర సినిమాలో చాలా కీలకంగా ఉంటుంది. కథ మొత్తం మలుపు తిప్పేది ఈ పాత్రే. ఇండియన్స్ ను ద్వేషించే పాకిస్థానీ అమ్మాయిగా అఫ్రిన్ పాత్ర ఉంటుంది.
ఈ పాత్ర కోసం ముందుగా పూజా హెగ్డేని సంప్రదించారట. కానీ కోవిడ్ వల్ల ఆమె కమిట్ అయిన సినిమాలు పెండింగ్ లో ఉండడం, కాల్ షీట్స్ ప్రాబ్లమ్ రావడంతో ఆమె తప్పుకున్నట్టు తెలుస్తుంది.పూజ కనుక ఈ పాత్ర చేసుంటే ఇంకా బాగుండేది అని అంతా అంటున్నారు. కానీ రష్మిక కూడా చాలా బాగా నటించింది అనడంలో అతిశయోక్తి లేదు.
ఇప్పటి వరకు ఆమె చేసిన పాత్రలకు చాలా భిన్నంగా ఈ చిత్రంలో ఆమె పాత్ర ఉంటుంది. ‘వైజయంతి మూవీస్’ బ్యానర్లో రష్మిక చేసిన రెండో చిత్రమిది. గతంలో ఇదే బ్యానర్లో ఆమె ‘దేవదాస్’ చిత్రం చేసింది.