తను శ్రీ దత్తా.. పరిచయం అవసరం లేని పేరు. ఒకప్పుడు బాలీవుడ్ ను తన గ్లామర్ తో ఓ ఊపు ఊపింది. ‘ఆషిక్ బనాయా’ అనే పాటతో ఈమెకు వచ్చిన గుర్తింపు అంతా ఇంతా కాదు. నందమూరి బాలకృష్ణ హీరోగా ఏ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘వీరభద్ర’ సినిమాలో కూడా ఈమె హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల సినిమాలకి దూరమైంది. అయితే ఆమె తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ వీడియో ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.
వివరాల్లోకి వెళితే…. తన ఇంట్లోనే తనను వేధిస్తున్నారంటూ తనుశ్రీ దత్తా ఓ వీడియో రిలీజ్ చేయడం సంచలనంగా మారింది.’నా ఇంట్లోనే నన్ను వేధిస్తున్నారు.. ఈ బాధ తట్టుకోలేక ఇలా వీడియో చేయాల్సి వస్తుంది. నా ఇంట్లో నాకు భద్రతే లేకుండా పోయింది. రేపు లేదా ఎల్లుండి పోలీసుల వద్దకు వెళ్తాను. అయితే ప్లీజ్.. ఎవరైనా ఇది చూసి సాయం చేస్తారని కోరుకుంటున్నాను’ అంటూ ఆమె ఆ వీడియో ద్వారా చెప్పుకొచ్చింది. వేరే వాళ్ళు కనుక ఇలాంటి వీడియో చేస్తే.. ‘ప్రాంక్ అనే వాళ్లేమో’.
కానీ తను శ్రీ దత్తా అలా కాదు. ఓ సెన్సిటివ్ ఇష్యూని లేవనెత్తి .. దాని పై పోరాడి.. సినిమాలకు దూరమైంది. 2018 లో ‘మీటూ’ ఉద్యమాన్ని ప్రారంభించింది ఈమెనే. స్టార్ నటుడు నానా పాటేకర్ పై ఈమె చేసిన కామెంట్స్ అప్పట్లో సంచలనం సృష్టించాయి. కాబట్టి.. ఆమె వీడియోని అంతా సీరియస్ గానే తీసుకుంటున్నారు.చూడాలి మరి దీని వెనుక ఉన్న కథేంటో.
View this post on Instagram
A post shared by Tanushree Dutta Miss India Universe (@iamtanushreeduttaofficial)