క్యాస్టింగ్ కౌచ్ ఏ రంగంలో అయినా ఉంటుంది. సినీ పరిశ్రమ ఇందుకేమీ మినహాయింపు కాదు. కాకపోతే సినీ పరిశ్రమలో మాత్రమే క్యాస్టింగ్ కౌచ్ ఉంటుంది అనే అపోహలో అంతా ఉంటారు. ఎందుకంటే జనాలకి రెగ్యులర్ టైం పాస్ టాపిక్ లు ఏమైనా ఉన్నాయా అంటే అందులో ఒకటి రాజకీయాలు. ఇంకోటి సినిమా. రెండిటిలో సినిమా పైనే వాళ్లకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. ముఖ్యంగా ‘మీటూ’ ఉద్యమం అందరినీ పెద్ద స్థాయిలో రెచ్చగొట్టింది.
ఈ క్రమంలో చాలామంది నటీమణులు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి మీడియా, సోషల్ మీడియా ముఖంగా చెప్పుకొచ్చారు. అయితే తర్వాత వారంతా సైలెంట్ అయిపోయారు. తెర వారు ఏం జరిగింది అనేది కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. అయితే ‘క్యాస్టింగ్ కౌచ్’ పై సీనియర్ దర్శకుడు గీత కృష్ణ చేసిన కామెంట్స్ పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఆయన మాట్లాడుతూ.. “ఆఫర్ల కోసం చాలా మంది హీరోయిన్లు హ్యాపీగా కమిట్మెంట్ ఇస్తారు.
అలా అయితేనే ఇక్కడ అవకాశాలు వస్తాయి వారు పెద్ద స్థాయికి చేరుకుంటారు. ఈ ఇండస్ట్రీ అనేది అమ్మాయిలకు సేఫ్ ప్లేస్ కాదు. సింగర్స్ విషయంలోనూ ఇది జరుగుతుంది, ఈ విషయాలు బయట పెడితే కొత్త ఆఫర్లు రావు. అందుకోసం ఎవ్వరో బయటపెట్టడానికి ఇష్టపడరు. అలా అని అందరినీ నిందించాల్సిన పని లేదు. ఈ కేటగిరీకి చెందిన వాళ్ళు 10 నుండీ 15 శాతం ఉంటారు” అంటూ గీతాకృష్ణ చెప్పుకొచ్చాడు.
గతంలో ఈయన ‘సంకీర్తన’, ‘కీచురాళ్ళు’, ‘కోకిల’ వంటి చిత్రాలను తెరకెక్కించాడు. తమిళంలో కూడా పలు చిత్రాలకి దర్శకత్వం వహించాడు కానీ అవి భారీ సక్సెస్ లు అందుకున్నది లేదు. అందుకే పలు యూట్యూబ్ ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు.