ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో హీరోలందరూ కూడా ఎక్కువగా పాన్ ఇండియా సినిమాలు చేసేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. ఒక్కసారి ఇటు వైపు వెళితే అసలు వెనక్కి తిరిగి చూసుకోవడం లేదు. ప్రభాస్ ప్రస్తుతం ఏ స్థాయిలో సినిమాలని వరుసబెట్టి చేస్తున్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక అతని తర్వాత పుష్ప తో బాక్స్ ఆఫీసు వద్ద మంచి విజయాన్ని అందుకున్న అల్లుఅర్జున్ కూడా అదే కంటిన్యూ చేయబోతున్నాడు. ఇక ఆ తర్వాత విజయ్ దేవరకొండ రామ్ చరణ్ తేజ జూనియర్ ఎన్టీఆర్ కూడా అదే తరహాలోనే సినిమాలు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.
అయితే ఈ హీరోలు ఇప్పట్లో లోకల్ సినిమాలు చేసే అవకాశం లేదని తెలుస్తోంది. ఇంతకుముందు ఓకే చేసిన తెలుగు కథలను కూడా రిజెక్ట్ చేసే విధంగా ఆలోచిస్తున్నారట. ఇదివరకే జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో చేయాల్సిన తెలుగు కథను రిజెక్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ కథకు పాన్ ఇండియాకు తగ్గట్టుగా లేదు అని త్రివిక్రమ్ కూడా ఆ రేంజ్ లో మార్చడం లేదని చెప్పడంతో దాన్ని రిజెక్ట్ చేసిన ఎన్టీఆర్ కొరటాల శివ సినిమాను ట్రాక్ లోకి తీసుకు వచ్చాడు.
ఇక విజయ్ దేవరకొండ శివ నిర్వాణ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయాల్సి ఉంది. లైగర్ అనంతరం అతని రేంజ్ కూడా కూడా మారిపోతుంది కాబట్టి ఆ దర్శకుడితో సినిమా చేస్తాడా లేదా అనేది డౌట్ గానే ఉంది. అల్లు అర్జున్ కూడా వకీల్ సాబ్ దర్శకుడు వేణు శ్రీరామ్ తో ఐకాన్ సినిమా చేయాల్సి ఉంది. ఆ కథ కూడా పాన్ ఇండియా రేంజ్ తగ్గట్టుగా సెట్టవ్వడం లేదు అని అల్లు అర్జున్ ఆలోచనలో పడినట్లు సమాచారం.
పుష్ప 2 తర్వాత ఈ దర్శకుడు మరిన్ని పాన్ ఇండియా సినిమాలు చేసే విధంగా అడుగులు వేస్తున్నాడు. అంతేకాకుండా రామ్ చరణ్ తేజ్ కూడా ఇంతకుముందు వెంకీ కుడుముల తో ఒక సినిమా చేయాలని అనుకున్నాడు. కానీ అతని సినిమా కథ కూడా లోకల్ గానే ఉండడంతో ఓకే చెప్పలేకపోయాడు. ఎన్టీఆర్ సైతం బుచ్చిబాబు కథను పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగా సెట్ చేసుకున్న తర్వాతనే గ్రీన్సిగ్నల్ ఇవ్వడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.