ప్రభాస్ (Prabhas) పాన్ ఇండియా స్టార్. దానికి మించి అతను చాలా మంచి మనిషి. అతను ఎంత మంచోడో.. చాలామంది సెలబ్రిటీలు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ‘కృష్ణంరాజు (Krishnam Raju) కంటే ప్రభాస్ వెయ్యి రెట్లు మంచోడు’ అని దర్శకుడు తేజ (Teja), ‘ప్రభాస్ 6 అడుగుల మంచి మనిషి’ అని బ్రహ్మానందం (Brahmanandam) ఇలా చాలా మంది స్టార్లు చెప్పారు. సెట్స్ లో జూనియర్ ఆర్టిస్టులను సైతం ‘బాగున్నావా’ అని పిలిచి మరీ అడుగుతాడట ప్రభాస్.
ఈ విషయాన్ని కొంతమంది జూనియర్ ఆర్టిస్టులు కూడా కొన్ని ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు. ఇలాంటి వాటి గురించి వేరే స్టార్ హీరోలు అయితే పీఆర్ టీంలతో తెగ ప్రమోట్ చేసుకుంటారు. కానీ ప్రభాస్ పబ్లిసిటీ గురించి అస్సలు ఆలోచించడు. తాజాగా ప్రభాస్ గురించి సీనియర్ రైటర్ తోట ప్రసాద్ మరో ఆసక్తికర విషయాన్ని షేర్ చేసుకున్నారు. గతంలో ఆయన ప్రభాస్ నటించిన ‘బిల్లా’ (Billa) సినిమాకి పనిచేశారు.
తోట ప్రసాద్ మాట్లాడుతూ.. “2010 శివరాత్రికి ముందు రోజు నేను అనారోగ్యం పాలవ్వడంతో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. అదే రోజు దురదృష్టవశాత్తు ప్రభాస్ నాన్న గారు అయినటువంటి సూర్య నారాయణ రాజు గారు కన్నుమూశారు.అయినప్పటికీ నేను హాస్పిటల్లో ఉన్న విషయం తెలుసుకున్న ప్రభాస్ గారు… నా ట్రీట్మెంట్ నిమిత్తం ఆయన పర్సనల్ అమౌంట్ ను పంపారు. నా పట్ల ఆయన తీసుకున్న కేరింగ్ అలాంటిది.
తన ఇంట్లో కష్టం ఉన్నప్పుడు ఎవరైనా సరే ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించరు. తండ్రిని కోల్పోవడం అంటే చిన్న విషయం కాదు. అయినప్పటికీ ‘నా సినిమా రైటర్ కష్టాల్లో ఉన్నాడు’ అని భావించి నాకు సాయం చేశారు. అంత మంచి వ్యక్తి ప్రభాస్ గారు. అలాంటి వ్యక్తితో మళ్ళీ చాలా ఏళ్ళ తర్వాత ‘కన్నప్ప’ కోసం పనిచేసే అవకాశం దక్కింది” అంటూ చెప్పుకొచ్చారు.