యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటనతో పాటు స్టైల్ తోను ఆకట్టుకుంటారు. ప్రతి సినిమాలోనూ తన మేకోవర్ పై దృష్టి పెట్టి అమ్మాయిలకు డార్లింగ్ అయ్యారు. కథకు తగినట్లు మార్చుకోవడంలో బాహుబలి ముందు ఉంటారు. హెయిర్ స్టైల్ నుంచి షూ వరకు ప్రత్యేకత చూపిస్తారు. యువతలో మంచి క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్ లుక్ లపై ఫోకస్..
01. ఈశ్వర్పక్కా హైదరాబాద్ కుర్రోడు ఎలా ఉంటాడో ఆ విధంగా ప్రభాస్ తన తొలి చిత్రం ఈశ్వర్ లో కనిపించి ఆకట్టుకున్నాడు. మెడలో కర్చీఫ్, మోచేతి వరకు మడిచిన షర్ట్, లూజ్ ఫ్యాన్ట్.. వస్త్ర ధారణలో మాస్ అప్పీల్ ని తీసుకొచ్చాడు. ఈ స్టయిల్ ని చాలామంది యువకులు ఫాలో అయ్యారు.
02. వర్షంయంగ్ రెబల్ స్టార్ కి తొలి సూపర్ హిట్ చిత్రం వర్షం. ఇందులో ప్రభాస్ చాలా కూల్ గా కనిపిస్తారు. ఆఫ్ హ్యాండ్ షర్ట్, కాటన్ ట్రౌజర్ లో సాఫ్ట్ లుక్ తో అమ్మాయిల మనసు దోచుకున్నారు. సింపుల్ డ్రస్సులో కూడా అందంగా కనిపించవచ్చని డార్లింగ్ నిరూపించాడు.
03. చక్రంనటనలో ప్రభాస్ వంద మార్కులు కొట్టేసిన సినిమా చక్రం. ఈ మూవీలోను స్టయిల్ గా కనిపించి తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఎక్కువ శాతం ఫుల్ హ్యాండ్ టీ షర్ట్ లో యూత్ ఐకాన్ అనిపించుకున్నాడు. ప్రధానంగా వీ నెక్ టీ షర్టుల్లో ప్రభాస్ టీనేజ్ కుర్రోడిలా కనిపించాడు.
04. ఛత్రపతిప్రభాస్ యాక్షన్ డోస్ పెంచిన మూవీ ఛత్రపతి. ఇందులో రెబల్ స్టార్ పనివాడుగా, పై వాడిగా కనిపించాడు. కండలు పెంచి మాస్ గా, పేద వారిని ఆదుకునే నాయకుడిగా .. రెండు వేరియేషన్ లోను డ్రస్ పై శ్రద్ధ పెట్టాడు. సినిమా ప్రథమార్ధంలో టైట్ హాఫ్ జీన్ షర్ట్ లో ప్రభాస్ ని చూడవచ్చు. ద్వితీయార్ధంలో బ్లేజర్ తో కనిపిస్తాడు.
05. మున్నా వంశీ పైడి పల్లి దర్శకత్వంలో వచ్చిన మున్నా లో ప్రభాస్ డిఫరెంట్ లుక్ లో కనిపిస్తాడు. జుట్టు పెంచి, టక్ చేసి భుజాన బ్యాగ్ తగిలించుకుని హుషారైన కుర్రోడిలా ఆకట్టుకున్నాడు. ఇందులో ప్రభాస్ వేసుకునే టీ షర్టులు ఇది వరకు ఏ హీరో వెయ్యలేదు. డార్లింగ్ కోసమే ప్రత్యేకంగా డిజన్ చేసినట్లు ఉంటాయి అవి.
06. బిల్లా ప్రభాస్ ద్విపాత్రాభినయం చేసిన తొలి చిత్రం బిల్లా. ఇందులో యువ డాన్ గా బ్లాక్ సూట్ లో మతిపోగొట్టాడు. కోట్ తో పాటు అతని స్టైల్ యాడ్ అవడం తో హ్యాండ్సమ్ పదానికి పర్యాయ పదమయ్యాడు. వైట్ కోట్ లోను రెబల్ స్టార్ గ్లామర్ తగ్గలేదు.
07. డార్లింగ్ఎక్కువభాగం విదేశాల్లో షూటింగ్ జరుపుకున్న డార్లింగ్ మూవీలో ప్రభాస్ అక్కడి వాతావరణానికి తగినట్లు స్టైల్ గా తయారయ్యాడు. రకరకాల డిజన్ల టీ షర్టులతో పాటు, డార్లింగ్ వాడిన హ్యట్లు అభిమానులకు భలే నచ్చాయి. వాటికి మంచి క్రేజ్ ఏర్పడింది.
08. మిస్టర్ ఫర్ ఫెక్ట్యంగ్ రెబల్ స్టార్ కి తగిన పేరు మిస్టర్ ఫర్ ఫెక్ట్ . ఆ పేరుతో వచ్చిన సినిమాలోనూ అన్ని విధాలుగా మిస్టర్ ఫర్ ఫెక్ట్ అనిపించుకున్నాడు ప్రభాస్. హెయిర్ ని షార్ట్ చేసి ఫ్యాషన్ వేర్ లో మెరిసిపోయాడు.
09. మిర్చిఆరు అడుగుల ఆజాన బాహుడు ఫార్మల్ వేర్ లో సూపర్ గా ఉంటాడని ముందుగానే ఊహించిన కొరటాల శివ ఆలోచనకు సెల్యూట్ కొట్టాల్సిందే. ఎందుకంటే మిర్చి లాంటి హాట్ పేరు పెట్టిన సినిమాలో ప్రభాస్ ని క్లాస్ గా చూపించి విజయాన్ని అందుకున్నాడు. డార్లింగ్ ఏ డ్రస్ కైనా అందం తెప్పించగలడని దీంతో నిరూపించాడు.
10. బాహుబలిరాజ్యాన్ని పాలించే రాజుల వస్త్ర ధారణ హుందాగా ఉంటాయి. రాజుల దుస్తుల్లోనూ ప్రభాస్ యువరాజుగా రాజసం చూపించాడు. యువరాజుగాను, సామాన్య వ్యక్తిగా ఉన్నపుడు వేసిన డ్రస్సులు ప్రభాస్ అందాన్ని రెట్టింపు చేశాయి.