సినిమా ఇండస్ట్రీ లో చాల మంది దర్శకులను ఓ చెడ్డ అలవాటు వెంటాడుతూ ఉంటుంది. వారు తెరకెక్కించిన ఓ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తే, ఇక వారి తదుపరి చిత్రాలు అదే కోవలో ఉంటాయి. వారు తెరకెక్కించే ప్రతి సినిమాలో ఆ బ్లాక్ బస్టర్ మూవీ వాసనలు కనిపిస్తూ ఉంటాయి. జోనర్ కూడా మార్చకుండా ఒకే మూస ధోరణిలో సాగుతూ ఉంటాయి. కెరీర్ ప్రారంభం నుండి యూనిక్ డైరెక్టర్ గా పేరున్న పూరి జగన్నాధ్ ఈ కోవకే వస్తాడు.
మహేష్ తో ఆయన చేసిన పోకిరి సినిమాకు ముందు ఆయన ప్రతి చిత్రం విభిన్నంగా ఉండేది. పోకిరి ఇండస్ట్రీ హిట్ తరువాత ఆయన మాఫియా, అనాథ హీరో, అండర్ కవర్ కాప్ అనే కాన్సెప్ట్ వదలకుండా వరుసగా సినిమాలు తీసి దెబ్బైపోయాడు. ఇక త్రివిక్రమ్ కూడా ఇంతే, అత్తారింటికి దారేది సినిమా హ్యాంగ్ ఓవర్ ఆయన్ని ఇంత వరకు వదల్లేదు. ఆ చిత్రం తరువాత ఆయన తీసిన అన్ని సినిమాల్లో ఆ సినిమా ఛాయలు కనిపిస్తున్నాయి.
కాగా కొత్తగా ఈ లిస్ట్ లోకి సుకుమార్ వచ్చి చేరాడు అనిపిస్తుంది. ఆయన లేటెస్ట్ మూవీ పుష్ప మూవీకి రంగస్థలం షేడ్స్ కనిపిస్తున్నాయి. బన్నీ గెటప్ రంగస్థలంలో చరణ్ చేసిన చిట్టిబాబు పాత్రను గుర్తు చేస్తుంది. ఇక ఇది కూడా రివేంజ్ సీరియస్ కథ అని గట్టిగా విన్పిస్తుంది. ఇక బన్నీ పాత్రకు ఎదో ఒక లోపం ఉన్నట్టుగా కూడా తడుతుంది. అన్నింటికీ మించి ఇది కూడా పీరియడ్ డ్రామాగా తోస్తుంది. సుకుమార్ కి కూడా రంగస్థలం హ్యాంగ్ ఓవర్ పట్టుకుందా అనిపిస్తుంది. మరి దీనిపై క్లారిటీ రావాలంటే కనీసం మూవీ టీజరో, ట్రైలరో రావాలి.