“పుష్ప 2” (Pushpa 2: The Rule) గ్లోబల్ లెవల్‌లో భారీ విజయాన్ని సాధించిన అనంతరం సుకుమార్ (Sukumar) కొత్త ప్రయోగాలకు సిద్ధమయ్యారు. ఈ చిత్రం కేవలం ఆరు రోజుల్లోనే 1000 కోట్ల క్లబ్‌లో చేరి, ఇండియన్ సినిమా స్థాయిని మరో మెట్టు పైకి తీసుకెళ్లింది. ఈ గ్రాండ్ సక్సెస్ తర్వాత దర్శకుడు కొద్దిరోజుల విరామం తీసుకొని తన తదుపరి ప్రాజెక్ట్‌లపై దృష్టి సారించబోతున్నారు. అయితే అందరూ “RC 17” స్క్రిప్ట్ వర్క్ మొదలవుతుందని భావించినా, సుకుమార్ ముందుగా ఓ ఆసక్తికరమైన OTT ప్రాజెక్ట్‌ను ప్రకటించబోతున్నట్లు సమాచారం.
Sukumar
సుకుమార్ నెట్‌ఫ్లిక్స్ కోసం ప్రత్యేకంగా ఒక డాక్యుమెంటరీ ప్రాజెక్ట్ చేయబోతున్నారు. ఈ డాక్యుమెంటరీ ప్రధానంగా “గంధపు చెట్లు” నేపథ్యంగా ఉండనుందని సమాచారం. “పుష్ప” (Pushpa) సినిమా కోసం సుకుమార్ గంధపు చెట్లపై విస్తృతమైన రీసెర్చ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ కథకు ఉపయోగించని సమాచారం, విశేషాలను నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీగా ప్రెజెంట్ చేయాలనే ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది. గంధపు చెట్లు, వాటి పెంపకం, అక్రమ రవాణా, ఎగుమతుల వంటి ఆసక్తికరమైన అంశాలను ఈ డాక్యుమెంటరీలో కవర్ చేయనున్నారు.
నెట్‌ఫ్లిక్స్ కూడా ఈ మధ్య ఆసక్తికరమైన డాక్యుమెంటరీలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సుకుమార్ ప్రాజెక్ట్ అందులో ఒక విభిన్నమైన ప్రయోగంగా నిలవనుంది. చిత్తూరు పరిసరాల్లో మాత్రమే దొరికే ఈ గంధపు చెట్లకు ఎందుకంత డిమాండ్ ఉందన్నది చూపించే ఈ డాక్యుమెంటరీ సరికొత్త కోణాన్ని చూపించబోతుంది. అంతేకాకుండా, గంధపు చెట్ల వేట, వాటి విలువ, మరియు రవాణా వెనుక ఉన్న మాఫియా స్టోరీస్ అన్నీ కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా ఉంటాయని తెలుస్తోంది.
ఈ డాక్యుమెంటరీ తర్వాత సుకుమార్, రామ్ చరణ్ (Ram Charan) కోసం “RC 17” స్క్రిప్ట్ వర్క్ ప్రారంభిస్తారని టాక్. “రంగస్థలం” (Rangasthalam) తర్వాత వీరిద్దరి కాంబినేషన్ పై భారీ అంచనాలు ఉన్నాయి. కానీ సుకుమార్ ముందుగా OTTలో ఓ కొత్త ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.