టాలీవుడ్ కి దొరికిన అద్భుతం కోటా శ్రీనివాసరావు. ఎటువంటి పాత్రనైనా అలవోకగా తెరపై పండించగల దిట్ట. ఆంధ్రా, తెలంగాణా మాండలికాలను అవపోసన పట్టిన కోటా డైలాగ్స్ చాలా సహజంగా పలికేవారు. సీరియస్ విలన్ గా, కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కోటా చేయని పాత్ర లేదు. ఏ పాత్రకైనా కొటా బెస్ట్ ఆప్షన్ అని దర్శకులు నమ్మేవారు. అందుకే నాలుగు దశాబ్దాలుగా ఆయన సినీ జర్నీ నిరాటకంగా సాగుతుంది. అనారోగ్య కారణాల చేత కోటా సినిమాలు తగ్గించారు. నటుడు సునీల్ కోటా ను ఫాలో అయితే బెటర్ అనేది చాలా మంది అభిప్రాయం. బేసిక్ గా సునీల్ కమెడియన్.
ఆయన స్టార్ కమెడియన్ గా వందల చిత్రాలలో నటించారు. అప్పట్లో సునీల్ లేని సినిమా అనేది ఉండేది కాదు. తనమార్కు కామెడీతో ప్రేక్షకులకు సునీల్ చాలా కాలం గిలిగింతలు పెట్టారు. ఐతే హీరోగా టర్న్ అయ్యాక ఆయన జర్నీ ఒడిదుడుకులకు లోనైది. అందాలరాముడు సినిమాతో హీరోగా మారిన సునీల్, మర్యాద రామన్న, పూల రంగడు చిత్రాలతో వరుస విజయాలు అందుకున్నారు. ఇక ఆ తరువాత ఆయన చేసిన అన్ని సినిమాలు బోల్తాకొట్టాయి. దీనితో హీరోగా ఆఫర్స్ ఆగిపోయాయి. దీనికి తోడు కమెడియన్ వేషాలు కూడా తగ్గిపోయాయి. హీరోగా చూసిన సునీల్ ని కమెడియన్ గా ప్రేక్షకులు చూసి నవ్వుకోలేకపోతున్నారు.
ప్రస్తుతం ఆయన విలన్ వేషాలు వేస్తున్నాడు. రవితేజ నటించిన డిస్కో రాజా మూవీలో విలన్ పాత్ర చేసిన సునీల్, కలర్ ఫొటో మూవీలో కూడా విలన్ గా చేస్తున్నారు. సునీల్ కోటా మాదిరి అన్ని పాత్రలు చేయగలను అని నిరూపించుకుంటే ఆయన కెరీర్ మైలేజ్ కి డోకా ఉండదు. అవసరాన్ని బట్టి సునీల్ కి దర్శకులు పాత్రలు ఆఫర్ చేసే అవకాశం ఉంటుంది. ఐతే అదంత ఈజీ కాదు. కోటా, ప్రకాష్ రాజ్, రావు రమేష్ వంటి అతి కొద్దిమంది నటులకు మాత్రమే అది సాధ్యం అయ్యింది . మరి సునీల్ వర్సిటైల్ యాక్టర్ గా ఎదుగుతాడో లేదో చూద్దాం.