సిద్ధార్థ్ హీరోగా దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా రూపొందిన మూవీ ‘టక్కర్’. కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పాషన్ స్టూడియోస్ తో కలిసి టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈరోజు అంటే జూన్ 9న తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. టీజర్, ట్రైలర్, సాంగ్స్ బాగున్నాయి. ఈసారి సిద్దార్థ్ హిట్ కొట్టడం గ్యారెంటీ అనే సంకేతాలు ఇచ్చాయి.
ఆల్రెడీ కొన్ని చోట్ల షోలు పడ్డాయి. సినిమా చూసిన వాళ్ళు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు. వారి టాక్ ప్రకారం సినిమా ఫస్ట్ హాఫ్ బాగానే ఉందట. ఇంటర్వెల్ బ్లాక్ అందరినీ ఎక్సయిట్ చేస్తుందట. సెకండ్ హాఫ్ పర్వాలేదనిపించే విధంగా ఉన్నా క్లైమాక్స్ హడావిడిగా ముగించినట్టు ఉంటుందని కొందరు చెబుతున్నారు. సిద్దార్థ్ చాలా కాలం తర్వాత ఓ డీసెంట్ సక్సెస్ అందుకున్నట్టు టక్కర్ సినిమా ఉంటుందని, పాటలు పెద్దగా ఎక్కువని, యాక్షన్ ఎపిసోడ్స్ బాగుంటాయని అంతా అంటున్నారు.
సినిమా (Takkar) రన్ టైం కూడా 2 గంటల 19 నిమిషాలు మాత్రమే ఉండటం మరో ఆకట్టుకునే అంశం అని అంటున్నారు. పీపుల్ మీడియా సంస్థ ఓ మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాని తెలుగు ప్రేక్షకులకి అందించిందని కూడా ఉంటున్నారు. మరి మార్నింగ్ షోలు ముగిశాక ఎలాంటి టాక్ బయటకు వస్తుందో చూడాలి.
#TAKKAR – Didn’t work for me. Dull 1st half, below par 2nd half. Mass moments & Love portions didn’t work at all. Songs good. Yogi Babu scenes worked at some places.
Premier show ~ #Takkar@sathyamcinemas … Sidharth done his role really gud, Yogi Babu comedy works gud & rj Vigneshkanth portion is okay … But stry wise aracha maava aracha maari iruku
1 word review – takkar knjm makkar
#Takkar : A young and dynamic Boy who has the urge to mint money and meets a Girl who believes Money is the cause of all distress in life and how their life transforms.