లాస్ట్ ఇయర్ కరోనా దెబ్బకి చాలా పరిశ్రమలు దెబ్బతిన్నాయి. ఇందులో సినీ పరిశ్రమ కూడా ఒకటి. ముఖ్యంగా థియేటర్స్ మూతబడటంతో చాలా సినిమాలు ఓటీటీని నమ్ముకుని రిలీజ్ అయ్యాయి. పెద్ద పెద్ద బడ్జెట్ సినిమాలు సైతం ఓటీటీల్లో దర్శనమిచ్చాయి. దీంతో దర్శక నిర్మాతలు చాలా నష్టపోయారు కూడా. సంక్రాంతి కి ముందు 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్స్ ఓపెన్ చేయగానే సోలో బ్రతుకే సో బెటర్ అంటూ సాయిథరమ్ తేజ్ బాక్సాఫీస్ కి ఊతం ఇచ్చాడు. దీంతో సంక్రాంతి రేస్ లో కొన్ని సినిమాలు రిలీజ్ చేశారు.
క్రాక్ సినిమా మంచి లాభాలు తెచ్చిపెట్టింది.అలాగే, రెడ్ మాస్టర్ అల్లుడు అదుర్స్ సినిమాలు కూడా వసూళ్లని బాగానే రాబట్టాయి. అయితే, ఆంక్షలతో కూడిన నియమాలు ఉండటం, 50శాతం మాత్రమే ఆక్యుపెన్సీ ఉన్నా కూడా చాలామంది థియేటర్స్ కి రాకపోవడం అనేది జరిగింది. ఇప్పుడు రీసంట్ గా థియేటర్స్ ఓపెన్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 100 శాంత ఆక్యుపెన్సీకి అనుమతులు ఇచ్చింది. అయితే, అక్కడక్కడా కొన్ని రాష్ట్రాల్లో మాత్రం దీన్ని అమలు చేయలేదు.
కానీ, ఇప్పుడు కరోనా కాస్త తగ్గుముఖం పట్టడంతో తెలంగాణ ప్రభుత్వం 100 శాతం థియేటర్స్ ఆక్యుపెన్సీకి అనుమతులు ఇచ్చేసింది. దీంతో ఇప్పుడు ప్రొడ్యూసర్స్ కి, డిస్ట్రిబ్యుటర్స్ కి వచ్చే సినిమాలు లాభాలు తెచ్చిపెడతాయని ఆశలు రేగుతున్నాయి. టాలీవుడ్ లో కూడా కొంతమంది తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి హర్షం వ్యక్తం చేస్తున్నారు.