‘బాహుబలి'(ది బిగినింగ్) సక్సెస్ అయిన తరువాత ప్రభాస్ క్రేజ్ బాగా పెరిగింది. దాంతో ఆ చిత్రానికి ముందు అతను నటించిన సినిమాలను తమిళ్, మలయాళం వంటి భాషల్లో డబ్బింగ్ చేశారు. ఆ టైములో ప్రభాస్ ప్లాప్ సినిమాలను కూడా డబ్ చేశారు. దాంతో అతని క్రేజ్ మొదట్లోనే దెబ్బ తింటుంది అనుకున్నారు. కానీ అలా డబ్ చేసిన సినిమాలు బాగానే కలెక్ట్ చేసాయి. అడ్వాన్స్ బేస్ మీద రిలీజ్ చేశారు కాబట్టి.. ఆ తర్వాత బుల్లితెర పై టెలికాస్ట్ చేసినప్పుడు బయ్యర్స్ కు లాభాలనే అందించాయి.
ఇక ‘బాహుబలి2’ తరువాత ప్రభాస్ క్రేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. అది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే సరిగ్గా ప్రభాస్ లానే ‘కె.జి.ఎఫ్’ హీరో యష్ కూడా అదే స్థాయిలో రాణిస్తాడు అని ఇప్పుడు అంతా అనుకుంటున్నారు. కానీ ఇటీవల అతని ‘గజకేసరి’ సినిమా రిజల్ట్ చూసిన తరువాత చాలా మందిలో డౌట్లు మొదలయ్యాయి. 2014 లో వచ్చిన ‘గజకేసరి’ చిత్రాన్ని ఇన్నేళ్ల తరువాత తెలుగులో అదే పేరుతో డబ్ చేశారు. దీని తెలుగు డబ్బింగ్ హక్కులను రూ15 లక్షలకు కొనుగోలు చేశారు.
గతవారం అంటే మార్చి 5న ఈ చిత్రాన్ని విడుదల చేశారు. అయితే ఈ చిత్రం రూ.6 లక్షలకు మించి కలెక్ట్ చెయ్యలేకపోయిందట. మొదటిరోజు నుండీ ఈ చిత్రానికి డెఫిసిట్స్ పడ్డాయి.. అంటే మైనస్ షేర్ అనమాట. దాంతో బయ్యర్ కు థియేట్రికల్ పరంగా ఏమి మిగలలేదని తెలుస్తుంది. ఒకవేళ శాటిలైట్ లేదా డిజిటల్ హక్కుల రూపంలో ఏమైనా మిగులుతుందేమో చూడాలి. ఏదేమైనా పరభాషా హీరోలకు ఎంత క్రేజ్ పెరిగినా.. వాళ్ళ ప్లాప్ సినిమాలను కూడా డబ్బింగ్ చేస్తే చూసేస్తారు తెలుగు ప్రేక్షకులు అనుకోవడం అమాయకత్వమే అవుతుందని చెప్పాలి.