టాలీవుడ్ నుంచి కాలీవుడ్ వరకూ యంగ్ టైగర్ పర్ఫార్మెన్స్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన పనిలేదు…ఆయన బరిలోకి దిగాడు అంటే చాలు…ఆటొమ్యాటిక్ గా యక్టింగ్ వచ్చేస్తుంది…అయితే అదే క్రమంలో హిట్స్ విషయంలో ఆ మధ్య కాలంలో కాస్త తడబడ్డ ఈ యువ కెరటం…ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు అనే చెప్పాలి…విషయంలోకి వెళితే…తెలుగు హీరోల్లో ఎవ్వరికీ దక్కని అరుదైన గౌరవం ఎన్టీఆర్ సినిమాకు దక్కింది….అదేంటి అంటే ఈ కధ చదవాల్సిందే….వివరాల్లోకి వెళితే….వరుస పరాజయాలతో డిగాలు పడిపోయిన ఎన్టీఆర్ అభిమానులకు “దట్ ఈజ్ ఎన్టీఆర్” అంటూ మరోసారి రుచి చూపించిన చిత్రం “టెంపర్” ఈ సినిమాకి ఆంగ్లంలో అరుదైన గౌరవం దక్కింది అనే చెప్పాలి…ఎలా అంటే…ఎన్టీఆర్ నటించిన టెంపర్ మూవీ….ఇప్పుడు ఇంగ్లీష్ లో నవలగా రాబోతోంది.
ఈ సినిమాకు కథ అందించిన వక్కంతం వంశీ కథను నవలగా ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన హారీపొట్టర్ సిరీస్ ను పబ్లిష్ చేసిన బ్లూమ్స్ బెర్రీ సంస్థ ‘టెంపర్’ నవలను ఇంగ్లీష్ లో ప్రచురించ బోతోంది. బ్లూమ్స్ బెర్రీ సంస్థకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. నోబుల్ బహుమతితో పాటు బుకర్ ప్రైజ్, పులిట్జర్, ఆరెంజ్ ప్రైజ్ లాంటి ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డుల్ని అందుకున్న నవలల్ని ఈ కంపెనీ ప్రచురించిన ట్రాక్ రికార్డు ఉంది. అటువంటి ప్రముఖ సంస్థ ‘టెంపర్’ సినిమాను నవలగా ప్రచురించడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. ఇక సినిమాలోనే కాదు….నవలలో కూడా హీరో దయ పాత్ర చాలా కీలకం అని తెలుస్తుంది…సో మొత్తంగా చూసుకుంటే…ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఇది పండగ అనే చెప్పాలి….ఎందుకంటే ఇప్పటివరకూ ఏ హీరోకి దక్కని అరుదైన గౌరవం ఎన్టీఆర్ ఖాతాలోకి వస్తుంది కదా…
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.