మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అల.. వైకుంఠపురములో సినిమా నుంచి అస్సలు తగ్గట్లేదు. మాస్ కమర్షియల్ సినిమాలకు మ్యూజిక్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా హైలెట్ అయ్యేలా వర్క్ చేస్తున్నాడు. అఖండ సినిమాతో థమన్ ప్రతిభ ఏమిటో మరోసారి చాలా క్లారిటీగా అర్ధమయ్యింది. ఇక ఆ తరువాత వచ్చే సినిమాలు కూడా అంతకు మించి అనేలా ఉంటాయని అర్థమవుతోంది. ఇక థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కు స్పెషలిస్ట్ గా బ్రాండ్ క్రియేట్ చేసుకోవడంతో పెద్ద సినిమా వాళ్ళు ఇప్పుడు అతనే కావాలని అంటున్నారు.
థమన్ ను ఇటీవల రాధేశ్యామ్ యూనిట్ కూడా సంప్రదించింది. ఆ సినిమాకు ఇప్పటికే సౌత్ లో ఒకరు నార్త్ లో మరో ఇద్దరు పాటలను కంపోజ్ చేశారు. ఇక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కోసం థమన్ ని ఫిక్స్ చేశారు. అసలైతే థమన్ ఏ సినిమాకు సగం సగం పనులు చేయనని ఒకప్పుడు చాలా క్లారిటీగా చెప్పాడు. ఒకరు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరొకరు మ్యూజిక్ అందిస్తే.. పెళ్లి ఒకడితో శోభనం మరొకడితో అన్నట్లుగా ఉంటుందని పెద్ద కౌంటర్ ఇచ్చాడు.
ఇక ఇప్పుడు రాధేశ్యామ్ కోసం ఎందుకు చేయాల్సి వస్తుంది అనే సందేహాలకు చాలా తెలివిగా ఆన్సర్ ఇచ్చాడు. అఖండ సినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇక నేను కేవలం ఇలాంటి సినిమాలే చేయగలను అని ముద్ర పడుతోంది. కాబట్టి ఇప్పుడు రాధేశ్యామ్ వంటి లవ్ స్టొరీ చేయాల్సిన అవసరం ఉంది.. అని థమన్ ఇటీవల ఒక క్లారిటీ ఇచ్చాడు. ఇక ప్రస్తుతం థమన్ చేతిలో అన్ని కూడా మంచి ప్రాజెక్టులే ఉన్నాయి.
భీమ్లా నాయక్, సర్కారు వారి పాట, గని, గాడ్ ఫాదర్, RC 15, తలపతి 66 వంటి సినిమాలతో పాటు మరికొన్ని చిన్న సినిమాలకు కూడా థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. అలాగే మరికొన్ని తమిళ సినిమాలు చేసేందుకు కూడా థమన్ ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.