అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya), సాయి పల్లవి (Sai Pallavi) కాంబినేషన్లో ‘లవ్ స్టోరీ’ (Love Story) తర్వాత వచ్చిన ‘తండేల్’ (Thandel) సినిమా విజయవంతంగా రూ.50 కోట్ల షేర్ మార్క్ ను అందుకుంది. కొత్త సినిమాలు ‘లైలా'(Laila) ‘బ్రహ్మ ఆనందం’ (Brahma Anandam) వంటివి వచ్చినా ‘తండేల్’ కి డిమాండ్ ఏమీ తగ్గలేదు అని ఆ నెంబర్ ను బట్టి అర్థం చేసుకోవచ్చు. నాగ చైతన్య కెరీర్లో రూ.50 కోట్ల షేర్ మార్క్ కి కొంచెం దూరంలో ఉంది.
6 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా ఇప్పటికీ డీసెంట్ కలెక్షన్స్ ను రాబడుతుంది. ఒకసారి 13 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 18.70 cr |
సీడెడ్ | 5.83 cr |
ఉత్తరాంధ్ర | 6.20 cr |
ఈస్ట్ | 2.78 cr |
వెస్ట్ | 1.99 cr |
కృష్ణా | 2.23 cr |
గుంటూరు | 2.14 cr |
నెల్లూరు | 1.12 cr (కరెక్టెడ్) |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 40.99 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 4.12 cr |
ఓవర్సీస్ | 4.55 Cr |
టోటల్ వరల్డ్ వైడ్ | 49.66 cr (షేర్) |
‘తండేల్’ (Thandel ) చిత్రానికి రూ.35.7 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.36 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 13 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.49.66 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా రూ.13.66 కోట్ల ప్రాఫిట్స్ తో సూపర్ హిట్ గా నిలిచింది ఈ సినిమా. గ్రాస్ పరంగా రూ.87.66 కోట్లు కొల్లగొట్టింది ఈ సినిమా.