‘తండేల్’ (Thandel) సినిమా గురించి ఎంత హైప్ ఉందో, అంతే డౌట్స్ కూడా ఉన్నాయి. దానికి కారణం ఆ సినిమా టీమే అని చెప్పాలి. సినిమాకు ఇన్నాళ్లూ కీలకం అని చెబుతూ వచ్చిన పాకిస్థాన్ ఎపిసోడ్ కేవలం 20 నిమిషాలే ఉంటుంది అని తేల్చేశారు. దీంతో చిన్నపాటి డౌట్స్ మొదలయ్యాయి. అల్లు అర్జున్ ఈవెంట్‌కి రాకపోవడం కూడా ఓ డౌట్. ఇంకొన్ని కూడా ఇలాంటివి ఉన్నాయి అనుకోండి. ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు టీమ్ చెబుతున్నదాని బట్టి చూస్తే వాళ్ల నమ్మకం వేరే అని తెలుస్తోంది.
Thandel
ఈ సినిమా నిర్మాత బన్ని వాస్ (Bunny Vasu) ఇటీవల మీడియాతో మాట్లాడుతూ సినిమా గురించి కొన్ని విషయాలు చెప్పారు. సినిమాకు కీలకంగా ఉంటాయని చెప్పిన ఆ విషయాలు చూస్తుంటే సినిమా టీమ్ అంతా అర్ధ గంట సినిమా మీద ఆధారపడింది అని తెలుస్తోంది. అది కాకుండా నాగచైతన్య (Naga Chaitanya) , సాయి పల్లవి (Sai Pallavi) నటన మీద నమ్మకం పెట్టుకున్నారు అని తెలుస్తోంది.
సినిమా దర్శకుడు చందు మొండేటి (Chandoo Mondeti) కెరీర్ చూస్తే ఆయన ఇస్తే భారీ విజయం లేదంటే, ఊహించని పరాజయం ఇస్తూ వచ్చారు. నాగచైతన్యకు ఒక మంచి సినిమా, ఒక డిజాస్టర్ ఇచ్చారు. ఇప్పుడు మూడో సినిమా ఎలా ఉంటుందో చూడాలి. అయితే సినిమాలో ఆఖరి అరగంట కీలకం అని నిర్మాత బన్ని వాస్ అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే కొన్ని సినిమాలు వచ్చాయి, ఇకపైనా రావొచ్చు. కానీ ఇది ప్రత్యేకం అంటున్నారు ఆయన.
నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితోనే సినిమాని తెరకెక్కించినా… రాజు, సత్య అనేవి కల్పిత పాత్రలని చెప్పారు. వారిద్దరి మధ్య ప్రేమ సినిమాలో ఇందులో కీలకమట. అలాగే అరగంట సినిమా మరోస్థాయిలో ఉంటుందని నమ్మకంగా చెబుతున్నారాయన. ఇదంతా వింటుంటే సినిమా టీమ్ నమ్మకం అర్థమవుతోంది. మరి వాళ్లు అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుందా లేదా అనేది ఈనెల 7న తెలుస్తుంది. ఎందుకంటే ఆ రోజే థియేటర్లలో రాజులమ్మ జాతర అని టీమ్ ఇప్పటికే అనౌన్స్ చేసింది.