Game Changer: గేమ్ ఛేంజర్ లో ఆర్ఆర్ఆర్ రేంజ్ యాక్షన్ సీన్.. ఆ సీన్ హైలెట్ అంటూ?
- September 11, 2024 / 10:18 AM ISTByFilmy Focus
రామ్ చరణ్ (Ram Charan) శంకర్ (Shankar) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ (Game Changer) సినిమాపై అంచనాలు బాగానే ఉన్నా శంకర్ ఇండియన్2 (Indian 2) సినిమాతో నిరాశ పరిచిన నేపథ్యంలో గేమ్ ఛేంజర్ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందనే చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. అయితే గేమ్ ఛేంజర్ లో ఒక యాక్షన్ సీక్వెన్స్ కోసం నిర్మాతలు ఏకంగా 15 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని సమాచారం అందుతోంది. గేమ్ ఛేంజర్ సినిమాకు హైలెట్ గా నిలిచేలా ఆ యాక్షన్ సీక్వెన్స్ ఉండనుందని సమాచారం అందుతోంది.
Game Changer

ఈ సీన్ ఆర్ఆర్ఆర్ (RRR) రేంజ్ యాక్షన్ సీన్ అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. గేమ్ ఛేంజర్ (Game Changer) సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. గేమ్ ఛేంజర్ సినిమా పాన్ ఇండియా మూవీగా ఇతర భాషల్లో సైతం విడుదల కానుండటం గమనార్హం. గేమ్ ఛేంజర్ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

గేమ్ ఛేంజర్ సినిమా కియారా అద్వానీ (Kiara Advani) కెరీర్ కు కీలకం కాగా పాన్ ఇండియా మూవీగా విడుదల కానున్న ఈ సినిమా ఫ్యాన్స్ ఆకలిని ఎంతమేర తీరుస్తుందో చూడాలి. గేమ్ ఛేంజర్ సినిమా నుంచి త్వరలో సెకండ్ సింగిల్ రిలీజ్ కానుండగా రిలీజయ్యే డేట్ కు సంబంధించి అతి త్వరలో క్లారిటీ రానుంది.

గేమ్ ఛేంజర్ (Game Changer) సినిమాకు థమన్ (S.S.Thaman) మ్యూజిక్, బీజీఎం హైలెట్ గా నిలవనున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. డిసెంబర్ నెల 20వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదలయ్యే ఛాన్స్ ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. గేమ్ ఛేంజర్ 2024 మెమరబుల్ సినిమాలలో ఒక సినిమాగా నిలవనుందని సమాచారం అందుతోంది. గేమ్ ఛేంజర్ చరణ్ కెరీర్ లో గేమ్ ఛేంజర్ అవుతుందో లేదో చూడాలి.
















