‘ది రాజాసాబ్’ (The Rajasaab) సినిమా ఏప్రిల్ 10న రిలీజ్ అవుతుంది అని మేకర్స్ ప్రకటించారు. కానీ ఏప్రిల్ 10 దాటేసి 5 రోజులు పూర్తయ్యింది. సాధారణంగా అనుకున్న రిలీజ్ డేట్ కి సినిమాని రిలీజ్ చేయలేకపోతున్న పక్షంలో.. రిలీజ్ డేట్ కి ముందు నిర్మాణ సంస్థ రంగంలోకి దిగి క్లారిటీ ఇవ్వాలి. ‘ప్రస్తుతానికి సినిమాని రిలీజ్ చేయలేకపోతున్నాం, త్వరలో రిలీజ్ డేట్ ను ప్రకటిస్తాం’.. ఇలా అనమాట. కానీ ‘పీపుల్ మీడియా సంస్థ’ స్పందించింది ఏమీ లేదు.
దీంతో ప్రభాస్ (Prabhas) అభిమానులు మారుతిని (Maruthi Dasari) టార్గెట్ చేసి నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. ఇక లేటెస్ట్ టాక్ ను బట్టి చూస్తే ‘ది రాజాసాబ్’ మేకర్స్ ఈ సినిమాని ‘3D’ ఫార్మాట్‌లోకి మార్చే ప్రయత్నాలు మొదలుపెట్టారట.కాబట్టి ఈ సినిమా విడుదల మరో 3 నెలలు పాటు వాయిదా పడే అవకాశం పుష్కలంగా ఉంది. మరోపక్క ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థకి ఓ పాపులర్ బాలీవుడ్ స్టూడియో సంస్థ మధ్య కొంత గ్యాప్ వచ్చిందట.
వీరి మధ్య ఏర్పడ్డ మనస్పర్థల కారణంగానే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో మార్పులు చోటు చేసుకున్నట్లు స్పష్టమవుతుంది. ఇప్పుడు 3D కి కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సి రావడంతో బడ్జెట్ కూడా పెరిగినట్టు తెలుస్తుంది. మరోపక్క ప్రభాస్ అభిమానులు ఈ సినిమా రిలీజ్ గురించి అప్డేట్ కావాలని మారుతిపై ఒత్తిడి తెస్తున్నారు. కానీ మారుతి కూడా ఇప్పుడు హెల్ప్ లెస్ అనేది గట్టిగా వినిపిస్తున్న టాక్. మరోపక్క ‘ది రాజాసాబ్’ సినిమా ఈ ఏడాది రిలీజ్ అయ్యే అవకాశాలు లేవని కూడా టాక్ నడుస్తున్న సంగతి తెలిసిందే.