నాగ చైతన్య హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం వస్తుంది అంటే సహజంగానే అంచనాలు ఏర్పడతాయి. అలాంటిది ఈ ప్రాజెక్టుని దిల్ రాజు నిర్మిస్తున్నారు అంటే అంచనాలు మామూలుగా ఉంటాయా. ఈ ప్రాజెక్టు మొదలైనప్పుడు అంచనాలు అదే విధంగా ఏర్పడ్డాయి. అయితే తర్వాత లాక్ డౌన్ అనేది ఏర్పడటం.. అటు తర్వాత ఓటీటీల దయవల్ల చాలా గొప్ప కంటెంట్ ను ప్రేక్షకులు చూసేయడంతో.. ‘థాంక్యూ’ రిలీజ్ టైంకి క్రేజ్ అంతా తగ్గిపోయింది.
ఇక జూలై 22న రిలీజ్ అయిన ఈ మూవీ పెద్ద డిజాస్టర్ గా మిగిలింది. అయితే ఈ చిత్రం ట్రైలర్ చూసినప్పుడు ‘నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్’ సినిమాకి దగ్గర పోలికలు ఉన్నాయి అనే కామెంట్లు కూడా వినిపించాయి. తాజాగా ఈ విషయాల పై అలాగే ‘థాంక్యూ’ ఫలితం పై రైటర్ బీవీఎస్ రవి స్పందించారు. ‘థాంక్యూ’ కి కథ అందించింది ఆయనే అన్న సంగతి తెలిసిందే. ఆయన మాట్లాడుతూ.. ” అసలు ‘నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్’ కథను దృష్టిలో పెట్టుకుంది ‘థాంక్యూ’ కథ డిజైన్ చేసుకోలేదు.
రావణుడు పై యుద్ధం గెలిచిన తర్వాత రాముడు.. యుద్ధంలో పాల్గొన్న ప్రతి ఒక్క సైనికుడికి ఏదో ఒక బహుమతి ఇచ్చి తన కృతజ్ఞతని తెలిపాడు. అయితే హనుమంతుడు కి మాత్రం అతను ఏ బహుమతి ఇవ్వలేదు. గట్టిగా హత్తుకున్నాడు. అంతకు మించి కృతజ్ఞత ఉండదు అనేది ‘థాంక్యూ’ యొక్క పాయింట్. దీనికి మేము(రవి, విక్రమ్ కుమార్) చాలా కథలు అనుకున్నాం.
ఫైనల్ గా ఒకటి ఫిక్స్ అయితే.. బాగానే ఉంది అనుకున్నాం. కానీ లాక్ డౌన్ వచ్చాక.. లేని పోని మార్పులు అన్నీ చేయడంతో.. ఫలితం నాకు అర్ధమైపోయింది. దీనికి ఎవ్వరినీ బ్లేమ్ చేయలేము. మొదట మేము అనుకున్న పాయింట్ ను కరెక్ట్ గా జస్టిఫై చేసి ప్రేక్షకులకు అందించినట్టు అయితే ‘థాంక్యూ’ ఫలితం మరోలా ఉండేది” అంటూ బీవీఎస్ రవి చెప్పుకొచ్చాడు.