యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గత కొన్నేళ్లుగా వివాదాలకు, వివాదాస్పద అంశాలకు దూరంగా ఉంటున్నారు. మరీ అవసరమైతే తను కచ్చితంగా స్పందించాల్సి ఉంటే తప్ప జూనియర్ ఎన్టీఆర్ కొన్ని విషయాల గురించి స్పందించడానికి ఇష్టపడటం లేదు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు గురించి తారక్ ఇప్పటికే స్పందించారు. వైసీపీపై మరీ తీవ్రస్థాయిలో విమర్శలు చేయకుండానే తారక్ స్పందించడం గమనార్హం. అయితే తారక్ స్పందించనంత వరకు ఒక విధంగా ట్రోల్ చేసిన నెటిజన్లు తారక్ స్పందించిన తర్వాత మరో విధంగా ట్రోల్ చేస్తున్నారు.
అయితే తారక్ హుందాగా స్పందించారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే తారక్ పై వస్తున్న ట్రోల్స్ వెనుక ఒక రాజకీయ పార్టీకి చెందిన నేతలు ఉన్నారని తెలుస్తోంది. తారక్ రాజకీయాల్లోకి రావడం ఇష్టం లేక ఆ పార్టీ నేతలు ఈ విధంగా చేస్తున్నారని తెలుస్తోంది. తారక్ ఏం చేసినా తప్పనే విధంగా ఆ పార్టీ నేతలు ప్రవర్తిస్తున్నారు. మరోవైపు తారక్ ప్రస్తుతం సినిమాలపైనే పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారు. త్వరలో తారక్ రెగ్యులర్ షూటింగ్స్ తో బిజీ కానున్నారు.
సినిమాసినిమాకు తారక్ కు క్రేజ్ పెరుగుతుండగా భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో తారక్ సంచలన విజయాలను సొంతం చేసుకుని రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. గత సినిమాలు సక్సెస్ సాధించడంతో తారక్ రెమ్యునరేషన్ భారీగా పెరిగిందని బోగట్టా. కెరీర్ విషయంలో తారక్ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. తారక్ కు దేశవిదేశాల్లో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కొరటాల శివ ప్రాజెక్ట్ ను పూర్తి చేసిన తర్వాత తారక్ ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ తో బిజీ కానున్నారు.
తారక్ కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. తారక్ ప్రతి ప్రాజెక్ట్ సక్సెస్ సాధించేలా జాగ్రత్త పడుతున్నారు. ఎంతోమంది దర్శకులు తారక్ తో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.