1972 వ సంవత్సరంలో వచ్చిన ‘పండంటి కాపురం’ చిత్రంతో బాలనటుడిగా కెరీర్ ను ప్రారంభించాడు సీనియర్ యాక్టర్ నరేష్. అటు తర్వాత 1982 వ సంవత్సరంలో ఇతని తల్లి విజయ నిర్మల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ప్రేమ సంకెళ్ళు’ చిత్రంతో హీరోగా కూడా మారాడు. అయితే ఆ చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.కానీ 1991 వ సంవత్సరంలో పి.ఎన్.రామచంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘చిత్రం భళారే చిత్రం’ ఇతనికి మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది.
దాంతో రాజేంద్ర ప్రసాద్ కామెడీ సినిమాలతో బిజీగా ఉన్న సమయంలో అతను చేయలేకపోయిన కొన్ని సినిమాలని నరేష్ చేయడంతో ఇతను కూడా బిజీ కామెడీ హీరోగా మారిపోయి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. ఆ టైములో చేసిన ‘జంబలకిడి పంబ’ వంటి చిత్రాలు బ్లాక్ బస్టర్లు కొట్టాయి. ఇక ప్రస్తుతం ఆయన సహ నటుడిగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఈయన వివాదాలతో కూడా వార్తల్లో నిలుస్తున్నారు.
ఇదిలా ఉండగా.. నరేష్ గారి పర్సనల్ లైఫ్ గురించి అందరికీ ఎక్కువగా తెలిసి ఉండదు. మరీ ముఖ్యంగా ఈయన మూడు పెళ్ళిళ్ళు చేసుకున్న సంగతి కూడా ఎక్కువ మందికి తెలిసుండదు. అవును నరేష్ కూడా మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. మొదటి సీనియర్ కెమెరామెన్ అయిన శ్రీను కుమార్తెను వివాహం చేసుకున్నారు నరేష్. వీరికి పుట్టిన అబ్బాయి నవీన్. ఆల్రెడీ రెండు, మూడు సినిమాల్లో కూడా హీరోగా నటించాడు. అయితే నరేష్ జన్మించిన తర్వాత మనస్ఫర్ధల కారణంగా తన మొదటి భార్యతో నరేష్ విడిపోయారు.
తర్వాత రెండో పెళ్ళి చేసుకున్నా అది కూడా నిలబడలేదు.రెండో పెళ్ళి కూడా విడాకుల బాట పట్టింది. అటు తర్వాత నరేష్ కు 50 ఏళ్ళ వచ్చాక ఆంధ్రప్రదేశ్ రాజకీయనాయకుడు అయిన రఘువీరారెడ్డి సోదరుడి కుమార్తె రమ్యను 2010 వ సంవత్సరం డిసెంబరు 3 న హిందూపురంలో పెళ్ళి చేసుకున్నారు.నరేష్ కు ముగ్గురు కొడుకులు ఉన్నారు.