నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హీరోగా తెరకెక్కిన ‘డాకు మహారాజ్’ (Daaku Maharaaj) సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అయ్యింది. సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. రొటీన్ కథ అయినప్పటికీ దర్శకుడు బాబీ (Bobby) ట్రీట్మెంట్ కానీ, హీరో బాలకృష్ణ కానీ చాలా కొత్తగా ప్రెజెంట్ చేయడం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ముఖ్యంగా సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ అంటే తమన్ (S.S.Thaman) అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోరు అని చెప్పాలి. ‘డాకు’ థీమ్ మ్యూజిక్ ని ఎంత మంది నెటిజన్లు..
ఎంత మంది హీరోలకి వాడుతున్నారో సోషల్ మీడియాలో మనం చూస్తూనే ఉన్నాం. ‘ఆదిత్య 369’ లో వేసిన బాలయ్య గెటప్ కి సంబంధించిన లుక్ ను కూడా ఇందులో బాగా ప్రెజెంట్ చేశారు. హీరోయిన్లకి కూడా సమానమైన ప్రాముఖ్యత ఇచ్చారు. ముఖ్యంగా శ్రద్దా శ్రీనాథ్ (Shraddha Srinath) ట్రాక్ బాగా వర్కౌట్ అయ్యింది. అంతా బాగానే ఉంది కానీ ఈ సినిమాలో ఒకరి పాత్ర మాత్రం బాగా డిజప్పాయింట్ చేసింది అని చెప్పాలి.
అదే టామ్ చాకో (Shine Tom Chacko) పోషించిన స్టీఫెన్ రాజ్ పాత్ర. వాస్తవానికి అతను బాగానే చేశాడు. కానీ ఈ పాత్రకి ముందుగా దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) , నాని (Nani) వంటి హీరోలను అనుకున్నారు. ఒక దశలో దుల్కర్ ఫిక్స్ అనుకున్నారు. కానీ పారితోషికాల లెక్కల దగ్గర తేడా వచ్చింది. తర్వాత విశ్వక్ సేన్ ను (Vishwak Sen) కూడా అడిగారు. అతను కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు. దీంతో హడావిడిగా టామ్ చాకోతో చేయించేశారు. ఈ సినిమా కోసం దుల్కర్ రూ.20 కోట్లు పారితోషికం డిమాండ్ చేశారట.
అతను ‘లక్కీ భాస్కర్’ కి (Lucky Baskhar) కూడా అంతే తీసుకున్నాడు. మలయాళంలో సినిమా రిలీజ్ చేస్తే కనుక దుల్కర్ ఇమేజ్ వల్ల కొంతలో కొంత బిజినెస్ అయ్యేది. కానీ రూ.20 కోట్ల రేంజ్లో ఉంటుందా అంటే డౌటే? అందుకే టీం అతన్ని లైట్ తీసుకుని టామ్ తో లాగించేశారని స్పష్టమవుతుంది.