మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఆచార్య’ సినిమాకి థియేటర్ల సమస్య మొదలైంది. నైజాంలో ఈ వ్యవహారం కాస్త సీరియస్ అయ్యేలా ఉంది. అసలు ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే.. ‘కేజీఎఫ్2’ సినిమా థియేటర్లోనే ఉంది. ఇప్పటికీ మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. ఆ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసింది దిల్ రాజు. కాబట్టి ‘కేజీఎఫ్2’ని థియేటర్లలో నుంచి తీయడానికి ఆయన అంగీకరించడం లేదు. పైగా నైజాంలో ‘ఆచార్య’ సినిమా డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను. ఆయనకు దిల్ రాజుకి మధ్య అంతగా పొసగడం లేదనే విషయం బయటపడింది.
ఇప్పుడు ‘కేజీఎఫ్2’ కలిసి వచ్చింది. థియేటర్లు ఖాళీగా ఉంటే వేరే సంగతి.. కానీ ‘కేజీఎఫ్2’ నడుస్తోంది కనుక కాదనేది లేదు. ఈ మేరకు మల్లగుల్లాలు నడుస్తున్నాయి. అయితే మెగాస్టార్ సినిమా.. అందులో రామ్ చరణ్ కూడా ఉన్నారు. ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణంలో రామ్ చరణ్ ఓ సినిమా చేస్తున్నారు. కాబట్టి ఆయన ‘ఆచార్య’ సినిమాకి అడ్డుపడలేరు. కానీ వరంగల్ శ్రీనుతో వ్యాపార పరమైన పోటీ తప్పదు. ఇలాంటి నేపథ్యంలో దిల్ రాజు-శిరీష్ ఎలా నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
ప్రస్తుతానికి అయితే ‘కేజీఎఫ్2’ ఆడుతున్న థియేటర్లకు ఫోన్ చేసి.. తీయడానికి వీలు లేదని.. సినిమాను కంటిన్యూ చేయమంటూ ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇవన్నీ పక్కన పెడితే.. ‘భరత్ అనే నేను’ సినిమా విషయంలో నైజాంలో కొంత రికవరీ ఉండిపోయింది. అది దిల్ రాజుకి రావాల్సివుంది. నిర్మాత దానయ్య తనకు సంబంధం లేదు.. కొరటాల శివ ఖాతాని అని అప్పట్లో చెప్పేశారు. మరిప్పుడు దిల్ రాజు ఆ విషయం కూడా సెటిల్ చేసుకునే ఆలోచనలో ఉన్నారట. మరేం జరుగుతుందో చూడాలి!