‘నాకు రోజుకి ఎంత కలెక్షన్ వచ్చింది అనేది ఇంపార్టెంట్ కాదు. నా సినిమాకి రోజుకి ఎన్ని టికెట్లు తెగాయి అన్నది ఇంపార్టెంట్’ అని రాజమౌళి ఓ సందర్భంలో అన్నట్టు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. ఒక సినిమా ఎంత కలెక్ట్ చేసిందో ట్రేడ్ చెబుతుంది. కానీ ఎన్ని టికెట్లు తెగాయి.. ఎంతమంది పలనా సినిమాని ఎక్కువగా చూశారు అనే విషయాన్ని ఎక్కువ మంది పట్టించుకోరు. తమ అభిమాన హీరో సినిమా రికార్డ్ కొట్టింది అనే పోస్టర్ కనిపిస్తే.. అభిమానులు హ్యాపీ. సినిమాకి ప్రమోషన్ కూడా బాగా జరుగుతుంది అనే ఉద్దేశంతో నిర్మాతలు ఎక్కువ గ్రాస్ కలెక్షన్లు వేసి పోస్టర్ ను విడుదల చేస్తారు. రాజమౌళి వంటి సిన్సియర్ ఫిలిం మేకర్స్ మాత్రమే.. ఫుట్ ఫాల్స్ గురించి ఆలోచిస్తారు అని సర్వేలు కూడా తేల్చేశాయి. సరే ఇక అసలు మేటర్ కు వచ్చేద్దాం. పెరిగిన టికెట్ రేట్ల వల్ల కొన్ని సినిమాలకు కలెక్షన్లు ఎక్కువ కనపడుతున్నాయి కానీ.. టాలీవుడ్లో ఏ సినిమాలకు ఎక్కువ టికెట్లు తెగాయి అనే విషయం పై ఇప్పుడు ఓ లుక్కేద్దాం రండి :
1) బాహుబలి 2(బాహుబలి ది కన్క్లూజన్) :
ప్రభాస్- రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ 2017 లో రిలీజ్ అయ్యింది. ఈ మూవీకి 10.82కోట్ల టికెట్లు అమ్ముడయ్యాయి.
2) బాహుబలి ది బిగినింగ్(బాహుబలి 1) :
ప్రభాస్- రాజమౌళి- రానా కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ 2015 లో రిలీజ్ అయ్యింది. ఈ మూవీకి 5.33 టికెట్లు అమ్ముడయ్యాయి.
3) ఆర్.ఆర్.ఆర్ :
రాంచరణ్- ఎన్టీఆర్- రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూవీకి 4.43 కోట్ల టికెట్లు అమ్ముడయ్యాయి. అయితే పెరిగిన టికెట్ రేట్ల దృష్ట్యా ఈ సినిమా కలెక్షన్లు ఎక్కువగా కనిపించాయి.
4) మగధీర :
రాంచరణ్ – రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన ఈ చారిత్రాత్మక చిత్రానికి 2009 లోనే 3.11 కోట్ల టికెట్లు అమ్ముడయ్యాయి.
5) లవకుశ :
1963 లో వచ్చిన ఎన్టీఆర్- అంజలి దేవి ల ‘లవకుశ’ చిత్రానికి ఏకంగా 2.75 కోట్ల టికెట్లు అమ్ముడయ్యాయి.
6) శివ :
నాగార్జున – రాంగోపాల్ వర్మ కాంబినేషన్లో వచ్చిన ఈ ఇండస్ట్రీ హిట్ మూవీకి 2.62 కోట్ల టికెట్లు తెగాయి.
7) పుష్ప ది రైజ్ (పుష్ప) :
అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీకి 2.6 కోట్ల టికెట్లు అమ్ముడయ్యాయి.
8) మాయాబజార్ :
సీనియర్ ఎన్టీఆర్,ఏఎన్నార్, జెమినీ గణేశన్ వంటి మహామహులు నటించిన ఈ మూవీకి 1957 టైంలోనే 2.5 కోట్ల టికెట్లు అమ్ముడయ్యాయి. ఈ మూవీ ఇప్పటికీ ఓ క్లాసిక్ అని అంతా భావిస్తారు. కె.వి.రెడ్డి గారు ఈ చిత్రానికి దర్శకుడు.
9) సాహో :
ప్రభాస్ హీరోగా నటించిన ఈ మూవీకి 2.5 కోట్ల టికెట్లు అమ్ముడయ్యాయి.2019 లో ఈ మూవీ రిలీజ్ అయ్యింది.
10) పోకిరి :
మహేష్ బాబు హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీకి 2.43 కోట్ల టికెట్లు అమ్ముడయ్యాయి.