బలహీనతలు ఉన్న నలుగురు హీరోయిన్లు వీళ్లే..!

సినిమా ఇండస్ట్రీలో ఉన్న వారికి సెంటిమెంట్స్ చాలా ఎక్కువ.. ఒక సినిమా కొబ్బరి కాయ కొట్టిన దగ్గరి నుండి గుమ్మడి కాయ కొట్టే వరకు జరిగే ప్రతి స్పెషల్ సందర్భానికి ప్రత్యేకమైన ముహూర్తం ఉండాల్సిందే.. అలాగే సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయ్యాక ఇష్ట దైవం గుడిలో పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాతే రిలీజ్ చేస్తుంటారు.. ఉండే ఇంటి వాస్తు నుండి వాడే వెహికల్స్ నంబర్ల వరకు కూడా తప్పకుండా సెంటిమెంట్స్ ఫాలో అవుతుంటారు..

ఇక న్యూమరాలజీ ప్రకారం పేర్లు మార్చుకోవడం అనేది కామన్‌గా జరుగుతుంటుంది.. ఇక హీరోయిన్లు మాత్రం ఇలాంటి వాటిని పెద్దగా ఫాలో అవుతున్నట్టు కనిపించరు కానీ అయ్యే వారు అవుతుంటారు.. అలాగే ఇండస్ట్రీలో వారికి కొన్ని బలహీనతలు కూడా ఉంటాయి.. డ్రింకింగ్, స్మోకింగ్, కార్డ్స్ ఆడడం లాంటివి కాదు.. చిన్న చిన్న విషయాలు ఏదో ఓసారి అలా అనుకోకుండా అలవాటైపోయి బలహీనతలుగా మారిపోతుంటాయి.. హీరోయిన్లకు కూడా కొన్ని క్రేజీ, ఫన్నీ బలహీనతలుంటాయి.. ఓ ఐదుగురు కథానాయికలకున్న ఆ బలహీనతలేంటో ఇప్పుడు చూద్దాం..

1) శృతి హాసన్..

శృతి హాసన్‌కి ఉన్న బలహీనత ఏంటంటే.. ఫ్లాపుల్లో ఉన్న స్టార్ హీరోలకు కమ్‌ బ్యాక్ ఇవ్వడం.. వరుస ఫ్లాపులతో ఉన్న పవన్ కళ్యాణ్‌కి ‘గబ్బర్ సింగ్’ తో.. రవితేజకి ‘క్రాక్’ తో మంచి కమ్‌ బ్యాక్స్ ఇచ్చింది.. ‘సాహో’, ‘రాధే శ్యామ్’ ఫ్లాపుల్లో ఉన్న ప్రభాస్‌కి ‘సలార్’ సాలిడ్ కమ్ బ్యాక్ ఇస్తుందేమో చూడాలి..

2) మంచు లక్ష్మీ..

మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీకి చరిత్రలో నిలిచిపోయే క్యారెక్టర్లను రిజెక్ట్ చేయడమనేది వీక్‌నెస్ అనే చెప్పాలి.. ‘అరుంధతి’ లో జేజమ్మ, ‘బాహుబలి’ లో శివగామి రోల్స్ మిస్ చేసుకుంది..

3) ప్రణీత..

కన్నడ బ్యూటీ ప్రణీతకి సెకండ్ హరోయిన్ క్యారెక్టర్లు చేయడం బలహీనత.. ‘అత్తారింటికి దారేది’, ‘రభస’, ‘బ్రహ్మోత్సవం’, ‘హలో గురు ప్రేమ కోసమే’ లాంటి సినిమాల్లో ఆమెవి సెకండ్ హీరోయిన్ పాత్రలే..

4) సాయి పల్లవి..

హీరోయిన్లందరిదీ ఒక దారి అయితే టాలెంటెడ్ అండ్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ సాయి పల్లవికి రీమేక్స్‌లో నటించడం ఇష్టముండదు.. అందుకే ‘వేదాళం’ తెలుగు రీమేక్ ‘భోళా శంకర్’ లో చిరంజీవి చెల్లెలుగా చేయమంటే నో చెప్పేసింది..

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus