యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) గురించి సినీ అభిమానులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు తారక్ పుట్టినరోజు కాగా తారక్ బర్త్ డే సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ అసలు పేరు తారక్ రామ్ కాగా సీనియర్ ఎన్టీఆర్ (N .T. Rama Rao) తారక్ రామ్ పేరును తారక రామారావుగా మార్చారు. భార్య లక్ష్మీ ప్రణతిని దేవుడిచ్చిన వరం అని ఎన్టీఆర్ భావిస్తారు. టాలీవుడ్ ఇండస్ట్రీలోని అందరు స్టార్ హీరోలతో తారక్ సన్నిహితంగా మెలుగుతారు.
బ్రహ్మర్షి విశ్వామిత (Brahmarshi Viswamitra) సినిమాలో భరతుడి పాత్రతో తారక్ నటుడిగా కెరీర్ ను మొదలుపెట్టారు. ఆ సమయంలో తారక్ వయస్సు కేవలం 8 సంవత్సరాలు కావడం గమనార్హం. ఆ తర్వాత బాల రామాయణం (Bala Ramayanam 1997) సినిమాలో రాముడి రోల్ లో నటించి ఆకట్టుకున్నారు. నిన్ను చూడాలని (Ninnu Choodalani) సినిమాతో హీరోగా పరిచయమైన తారక్ ఇప్పటివరకు 29 సినిమాల్లో నటించారు. ప్రస్తుతం వరుస తెలుగు సినిమాలతో ఎన్టీఆర్ బిజీగా ఉన్నారు.
జపాన్ లో తారక్ కు ఊహించని స్థాయిలో క్రేజ్ ఉండగా తారక్ మంచి గాయకుడిగా మంచి హోస్ట్ గా పేరు సంపాదించుకున్నారు. ఎన్టీఆర్ లక్కీ నంబర్ 9 కాగా ఎన్టీఆర్ నటించిన సింహాద్రి (Simhadri) 1000 స్క్రీన్లలో రీరిలీజ్ అయింది. ఒక రకంగా ఇది రికార్డ్ అని చెప్పవచ్చు. సినిమా సినిమాకు లుక్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం, ఎలాంటి డైలాగ్ అయినా అలవోకగా చెప్పడం, చిన్నచిన్న ఎక్స్ ప్రెషన్లను సైతం అద్భుతంగా పలికించడం తారక్ కు మాత్రమే సాధ్యమని చెప్పవచ్చు.
ఈ లక్షణాలే తారక్ ను స్టార్ చేశాయని ఫ్యాన్స్ భావిస్తారు. ఎన్టీఆర్ సినిమాలు ఫ్లాప్ అయ్యి ఉండవచ్చు కానీ ఎన్టీఆర్ నటుడిగా ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. తారక్ నటన నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. పారితోషికం పరంగా కూడా తారక్ టాప్ లో ఉన్నారు.