Saripodhaa Sanivaaram: సరిపోదా శనివారం మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేది అప్పుడేనా?

  • August 29, 2024 / 10:27 PM IST

నాని (Nani)  హీరోగా వివేక్ ఆత్రేయ  (Vivek Athreya) డైరెక్షన్ లో తెరకెక్కిన సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram) మూవీ తాజాగా థియేటర్లలో విడుదలై హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. నిడివి ఎక్కువగా ఉందనే కామెంట్లు వినిపిస్తున్నా మెజారిటీ ప్రేక్షకులు ఈ సినిమా గురించి పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. నాని ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ చేరినట్టేనని అభిమానులు ఫిక్స్ అయ్యారు. నాని సరిపోదా శనివారం సినిమాలో సూర్య రోల్ కు పూర్తిస్థాయిలో న్యాయం చేశారు.

Saripodhaa Sanivaaram

అయితే సరిపోదా శనివారం స్ట్రీమింగ్ హక్కులు ప్రముఖ ఓటీటీలలో ఒకటైన నెట్ ఫ్లిక్స్ సొంతమయ్యాయి. సౌత్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుందని తెలుస్తోంది. సాధారణంగా నెట్ ఫ్లిక్స్ సినిమా రిలీజైన 28 రోజుల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తుంది. సరిపోదా శనివారం విషయంలో సైతం అదే రూల్ ఫాలో అయితే సెప్టెంబర్ 26 నుంచి ఈ సినిమా ఓటీటీలో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఒకవేళ మరింత ఆలస్యంగా స్ట్రీమింగ్ చేసేలా ఒప్పందం కుదిరి ఉంటే మాత్రం నాని ఫ్యాన్స్ కు ఎదురుచూపులు తప్పవు. సరిపోదా శనివారం హిందీ రైట్స్ మాత్రం జియో సినిమా సొంతమయ్యాయని తెలుస్తోంది. నెట్ ఫ్లిక్స్ లో సౌత్ భాషల్లో సరిపోదా శనివారం స్ట్రీమింగ్ అయిన రోజే జియో సినిమాలో సైతం అందుబాటులోకి వస్తుందో లేక ఆలస్యంగా అందుబాటులోకి వస్తుందో తెలియాల్సి ఉంది.

దేవర (Devara) రిలీజయ్యే వరకు తెలుగులో పెద్ద సినిమాలేవీ రిలీజ్ కావట్లేదు కాబట్టి సరిపోదా శనివారం మూవీ రాబోయే నాలుగు వారాలు కలెక్షన్ల పరంగా అదరగొట్టే ఛాన్స్ అయితే ఉంది. గురువారం రోజున రిలీజై పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోవడంతో ఫస్ట్ వీకెండ్ వరకు రికార్డ్ స్థాయిలో కలెక్షన్లతో అదుర్స్ అనిపించడం పక్కా అని చెప్పవచ్చు. స్క్రిప్ట్స్ సెలక్షన్ విషయంలో నానికి ఎవరూ సాటిరారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

కొత్త సినిమా కోసం సీనియర్‌ నాయికతో ఆడిపాడిన సూర్య.. ఎవరంటే?

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus