షార్ట్ ఫిలిమ్స్ ద్వారా గుర్తింపును సంపాదించుకుని తుంటరి సినిమాతో పూజిత పొన్నాడ సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత దర్శకుడు సినిమాలో హీరోయిన్ గా నటించి గుర్తింపును సంపాదించుకున్నారు. వైజాగ్ కు చెందిన పూజిత పొన్నాడ సుకుమార్ డైరెక్షన్ లో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన రంగస్థలం సినిమాలో కీలక పాత్రలో నటించారు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టైనా పూజితకు మాత్రం సినిమా ఆఫర్లు పెరగలేదు. రంగస్థలం సినిమా తరువాత పూజిత కల్కి, వేర్ ఈజ్ ది వెంకట లక్ష్మి, రన్, మిస్ ఇండియా ఇతర సినిమాల్లో నటించారు.
ప్రస్తుతం పూజిత పొన్నాడ చేతిలో చిన్న సినిమాలు ఎక్కువగా ఉన్నాయి. పెద్ద సినిమాలతో పోలిస్తే చిన్న సినిమాల్లోనే పూజిత పొన్నాడకు ఎక్కువగా ఆఫర్లు వస్తున్నాయి. ఓదెల రైల్వేస్టేషన్, ఆకాశ వీధుల్లో సినిమాలతో పాటు పవన్ కళ్యాణ్ క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమాలో పూజిత కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇండస్ట్రీలో చాలా సంవత్సరాల నుంచి ఉన్నా సరైన గుర్తింపు లేక కెరీర్ లో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న పూజిత పొన్నాడ హరిహర వీరమల్లు సినిమా తరువాతైనా వరుస ఆఫర్లతో బిజీ అవుతారేమో చూడాల్సి ఉంది.

అందం, అభినయం పుష్కలంగా ఉన్నా లక్ లేకపోవడంతో పూజితకు పెద్దహీరోల సినిమాల్లో ఎక్కువగా ఆఫర్లు రావడం లేదు.వకీల్ సాబ్ సినిమాలో తెలుగమ్మాయిలు అంజలి, అనన్యలకు అవకాశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్ తరువాత సినిమాల్లో కూడా తెలుగమ్మాయిలకు అవకాశాలు ఇస్తుండటం గమనార్హం. వకీల్ సాబ్ సినిమాలో నటించిన హీరోయిన్లకు ఆ సినిమా తరువాత స్టార్ హీరోల సినిమాల్లో ఆఫర్లు వస్తుండగా హరిహర వీరమల్లు తరువాత పూజిత పొన్నాడకు కూడా స్టార్ హీరోల సినిమాల్లో ఎక్కువగా ఆఫర్లు వస్తాయేమో చూడాల్సి ఉంది.
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

51

52

53

54

55

56

57

58

Most Recommended Video
‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!
