రామ్ చరణ్ తేజ్ బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఆరెంజ్ మూవీ 2010 సంవత్సరంలో థియేటర్లలో విడుదలై డిజాస్టర్ గా నిలిచింది. అయితే ఈ సినిమా కొన్ని వారాల క్రితం రీ రిలీజ్ కాగా రీ రిలీజ్ లో మాత్రం ఈ మూవీ సంచలనాలను సృష్టించింది. రీ రిలీజ్ లో ఈ సినిమా భారీ స్థాయిలో కలెక్షన్లను సాధించింది. అయితే రీ రిలీజ్ లో ఈ సినిమా సాధించిన కలెక్షన్లను జనసేన పార్టీకి విరాళం ఇవ్వడం జరిగింది.
ఖర్చులు తీసేసి కోటీ 5 లక్షల రూపాయలను విరాళంగా ఇస్తున్నట్టు నాగబాబు ప్రకటించారు. నాగబాబు చేసిన ప్రకటన ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగించింది. కోటి రూపాయలు అంటే తక్కువ మొత్తం కాదని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. చరణ్ కు, చరణ్ ఫ్యాన్స్ కు కృతజ్ఞతలు అని నాగబాబు వెల్లడించారు. చరణ్ ఫ్లాప్ సినిమానే ఈ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తే హిట్ సినిమాలు రీరిలీజ్ అయితే ఏ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటాయో చూడాలి.
(Orange) ఆరెంజ్ రీ రిలీజ్ లో ఈ స్థాయిలో సంచలన విజయం సాధించడం ఫ్యాన్స్ ఆనందానికి కారణమైంది. రామ్ చరణ్ కెరీర్ విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటుండగా వచ్చే ఏడాది చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమాతో పాటు బుచ్చిబాబు మూవీ థియేటర్లలో విడుదల కానుంది. ఈ రెండు సినిమాలు ఏకంగా 600 నుంచి 700 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతోందని తెలుస్తోంది.
సినిమా సినిమాకు చరణ్ రేంజ్ పెరుగుతున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ ఈ సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో మరిన్ని సంచలనాలను సృష్టిస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చరణ్ రెమ్యునరేషన్ 100 కోట్ల రూపాయల స్థాయిలో ఉందని ప్రచారం జరుగుతుండగా చరణ్ మాత్రం తన పారితోషికం తక్కువగానే ఉందని చెబుతున్నారు. చరణ్ రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.