Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Reviews » Thodelu Review: తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

Thodelu Review: తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

  • November 25, 2022 / 08:21 AM ISTByFilmy Focus
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
Thodelu Review: తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • వరుణ్ ధావన్ (Hero)
  • కృతి సనన్ (Heroine)
  • దీపక్ డోబ్రియాల్ (Cast)
  • అమర్ కౌశిక్ (Director)
  • దినేష్ విజయ్‌ ,జిఓ స్టూడియోస్ (Producer)
  • సచిన్ -జిగర్ (Music)
  • జిష్ణు భట్టాచార్జీ (Cinematography)
  • Release Date : 25 నవంబర్ 2022
  • మ్యాడ్‌డాక్‌ ఫిలింస్‌ ,జిఓ స్టూడియోస్ (Banner)

“స్త్రీ, బాలా” వంటి చిత్రాలతో సూపర్ హిట్ డైరెక్టర్ గా పేరొందిన అమర్ కౌశిక్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం “భేడియా”. ఈ హిందీ చిత్రాన్ని తెలుగులో “తోడేలు” అనే టైటిల్ తో అనువదించారు. వరుణ్ ధావన్ – కృతి సనన్ జంటగా నటించిన ఈ చిత్రం హిందీతోపాటు పలు దక్షిణ భారత ప్రాంతీయ భాషల్లో ఏకకాలంలో విడుదలైంది. మరి ఈ ఫిక్షనల్ ఫిలిమ్ ఆడియన్స్ ను ఏమేరకు అలరించిందో చూద్దాం..!!

కథ: అరుణాచల్ ప్రదేశ్ అడవుల్లో రోడ్ వేయడానికి వచ్చిన ఇంజనీర్ భాస్కర్ (వరుణ్ ధావన్). రోడ్డు వేసే ప్లానింగ్ లో భాగంగా అడవిలో రెక్కీ చేస్తుండగా.. భాస్కర్ ను ఒక తోడేలు కరుస్తుంది. అప్పట్నుంచి ప్రతిరోజూ రాత్రి భాస్కర్ తోడేలులా రూపాంతరం చెందుతుంటాడు. దాంతో ట్రీట్మెంట్ కోసం జంతువుల డాక్టర్ అయిన అంకిత (కృతి సనన్) వద్దకు వెళతారు.

అసలు భాస్కర్ తోడేలులా ఎందుకు మారుతున్నాడు? అంకిత ట్రీట్మెంట్ ఏమైనా ఉపశమనం కలిగించిందా? లేదా? అనేది “తోడేలు” సినిమా చూసి తెలుసుకోవాల్సిన విషయం.

నటీనటుల పనితీరు: వరుణ్ ధావన్ ఎనర్జీ, స్క్రీన్ ప్రెజన్స్ & పెర్ఫార్మెన్స్ భలే ఉన్నాయి. ఓ సాధారణ కుర్రాడిగా నవ్విస్తూనే.. తోడేలుగా మారే తరుణంలో భయపెడుతూ థ్రిల్ చేశాడు. అలాగే ఎమోషనల్ సీన్స్ లో ఆకట్టుకున్నాడు.

కృతి సనన్ నటిగా పర్వాలేదు అనిపించుకుంది కానీ.. ఆమె స్క్రీన్ ప్రెజన్స్ & లుక్ సినిమాకి మైనస్ గా మారాయి. వరుణ్ తో కెమిస్ట్రీ కూడా అంతగా వర్కవుటవ్వలేదు.

కమెడియన్ అభిషేక్ బెనర్జీ సింగిల్ లైనర్స్ & స్క్రీన్ ప్రెజన్స్ సినిమాకి మెయిన్ ఎస్సెట్ గా నిలిచింది. రాజ్ కుమార్ రావు & శ్రద్ధాకపూర్ క్యామియోలను సరిగా వాడుకోలేదు చిత్రబృందం.

సాంకేతికవర్గం పనితీరు: సినిమాటోగ్రాఫర్ జిష్ణు భటాచార్య టేకింగ్ సినిమాకి మెయిన్ ఎస్సెట్ గా నిలిచింది. వి.ఎఫ్.ఎక్స్ టీం పనితనాన్ని కూడా మెచ్చుకోవాలి. పరిమిత బడ్జెట్లో అద్భుతమైన అవుట్ పుట్ ఇచ్చారు ఈ ఇద్దరూ. సచిన్-జిగర్ సంగీతం సోసోగా ఉంది. క్యాచీ ట్యూన్స్ లేకపోవడం మైనస్.

దర్శకుడు అమర్ కౌశిక్ ఎప్పట్లానే ఓ సాధారణ పాయింట్ ను అసాధారణంగా ప్రెజంట్ చేశాడు. అయితే.. ఈ సినిమాలో కాస్త లాజికల్ సోల్యూషన్స్ అవసరం ఉండడంతో.. మునుపటి రెండు సినిమాలు పండినంతగా ఈ సినిమాలో హాస్యం పండలేదు. అలాగే.. జస్టిఫికేషన్ విషయంలో కూడా తడబడి, చుట్టబెట్టేశాడు. అందువల్ల ఆడియన్స్ ను సంతుష్ట పరచలేకపోయాడు.




విశ్లేషణ: లాజిక్స్ ను పక్కన పెడితే “తోడేలు” ఒక టైమ్ పాస్ సినిమా. అయితే.. తెలుగు డబ్బింగ్ సరిగా కుదరకపోవడం, క్లైమాక్స్ జస్టిఫికేషన్ సరిగా లేకపోవడం, కృతి సనన్ లుక్ బాగోకపోవడం వంటి కారణాలుగా సినిమాకి తెలుగు ఆడియన్స్ అంతగా కనెక్ట్ అవ్వలేరు.




రేటింగ్: 2/5




Click Here To Read In ENGLISH

Rating

2
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aha
  • #Allu Aravind
  • #Amar Kaushik
  • #Kriti Sanon
  • #thodelu

Reviews

Akka Review in Telugu: అక్క వెబ్‌సిరీస్  రివ్యూ & రేటింగ్!

Akka Review in Telugu: అక్క వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్!

Cult Review in Telugu: ‘కల్ట్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Cult Review in Telugu: ‘కల్ట్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Aadarsha Kutumbam Review in Telugu: ఆదర్శ కుటుంబం హౌస్ నెం47 సినిమా రివ్యూ & రేటింగ్!

Aadarsha Kutumbam Review in Telugu: ఆదర్శ కుటుంబం హౌస్ నెం47 సినిమా రివ్యూ & రేటింగ్!

KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Ram Charan: ‘రామాయణ’ను అప్పట్లో అనుకున్నట్లు రామ్‌చరణ్‌తో తీసుంటే.. ఇప్పుడు పరిస్థితి ఏంటో?

Ram Charan: ‘రామాయణ’ను అప్పట్లో అనుకున్నట్లు రామ్‌చరణ్‌తో తీసుంటే.. ఇప్పుడు పరిస్థితి ఏంటో?

Janhvi Kapoor: ‘పెద్ది’ అచ్చియమ్మ పాత్రపై తొలిసారి స్పందించిన జాన్వీ కపూర్‌.. ఏమందంటే?

Janhvi Kapoor: ‘పెద్ది’ అచ్చియమ్మ పాత్రపై తొలిసారి స్పందించిన జాన్వీ కపూర్‌.. ఏమందంటే?

trending news

మనోరమా మాక్స్ లో విడుదలైన మొదటి వారంలోనే 15 మిలియన్లకు పైగా వాచ్ టైమ్‌ను సాధించిన ‘ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్’

మనోరమా మాక్స్ లో విడుదలైన మొదటి వారంలోనే 15 మిలియన్లకు పైగా వాచ్ టైమ్‌ను సాధించిన ‘ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్’

3 hours ago
Aadarsha Kutumbam AK 47 Collections: 4వ రోజు డౌన్ అయిన ‘ఆదర్శ కుటుంబం’ వసూళ్ళు

Aadarsha Kutumbam AK 47 Collections: 4వ రోజు డౌన్ అయిన ‘ఆదర్శ కుటుంబం’ వసూళ్ళు

14 hours ago
Cult Collections: 4వ రోజు మరింతగా డౌన్ అయిన ‘కల్ట్’

Cult Collections: 4వ రోజు మరింతగా డౌన్ అయిన ‘కల్ట్’

14 hours ago
Radhika Apte: మళ్ళీ బాలయ్యని టార్గెట్ చేసిన రాధిక.. మేనమామ పాత్రతో రొమాన్స్ అంటూ?

Radhika Apte: మళ్ళీ బాలయ్యని టార్గెట్ చేసిన రాధిక.. మేనమామ పాత్రతో రొమాన్స్ అంటూ?

1 day ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

1 day ago

latest news

ఈఎన్ఈ రిపీట్ ట్రైలర్.. ఆకట్టుకున్న శ్రీనాథ్ మాగంటి

ఈఎన్ఈ రిపీట్ ట్రైలర్.. ఆకట్టుకున్న శ్రీనాథ్ మాగంటి

1 day ago
Suriya – Dhanush: రజనీ – కమల్‌ స్టయిల్‌లో మరో కాంబో సెట్‌ చేస్తున్న కోలీవుడ్.. ఎవరెవరంటే?

Suriya – Dhanush: రజనీ – కమల్‌ స్టయిల్‌లో మరో కాంబో సెట్‌ చేస్తున్న కోలీవుడ్.. ఎవరెవరంటే?

1 day ago
Sai Abhyankkar: ఫ్లాప్‌ హీరోయిన్‌ను ఓకే చేసిన సాయి అభ్యంకర్‌.. ఈ పాట ఎలా ఉంటుందో?

Sai Abhyankkar: ఫ్లాప్‌ హీరోయిన్‌ను ఓకే చేసిన సాయి అభ్యంకర్‌.. ఈ పాట ఎలా ఉంటుందో?

1 day ago
Aadarsha Kutumbam AK 47: మొదటి వీకెండ్ ముగిసేసరికి 43 శాతం రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47: మొదటి వీకెండ్ ముగిసేసరికి 43 శాతం రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

1 day ago
Cult Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘కల్ట్’

Cult Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘కల్ట్’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version