మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ మూవీ ఇటీవల దసరా కానుకగా అక్టోబర్ 9న రిలీజ్ అయ్యింది. ఈ సినిమా మొదటి షోతోనే హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘లూసిఫర్’ కు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కింది. తెలుగులో ఆల్రెడీ డబ్ అయిన మూవీ అది. కాబట్టి తెలుగు ప్రేక్షకుల అభిరుచి మేరకు, ముఖ్యంగా చిరంజీవి అభిమానుల అభిరుచి మేరకు స్క్రిప్ట్ లో చాలా మార్పులు చేశారు.
ఇది చిరంజీవి ఇమేజ్ కు తగ్గ కథ. కాబట్టి సినిమాలో ఎన్నో లూప్-హోల్స్ ఉన్నప్పటికీ ప్రేక్షకులను సంతృప్తి పరిచే విధంగా అనిపిస్తుంది. అయితే సినిమాలో ఉన్న మైనస్సులో సత్యదేవ్ విలనిజం ఒకటి అని చెప్పాలి. అతని వరకు ఈ సినిమాలో చాలా బాగా నటించాడు. కానీ ఒరిజినల్ చూసిన వారికి కానీ, నేరుగా ఈ సినిమా చూస్తున్న వారికి కానీ అతని పాత్ర సంతృప్తి పరిచే విధంగా ఉండదు. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి ఆరా ముందు అతను చిన్నగా కనిపిస్తాడు.
ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సత్యదేవ్ గురించి చిరంజీవి ఇచ్చిన హై కూడా సత్యదేవ్ విలనిజానికి కనెక్ట్ అవ్వకపోవడానికి ఓ కారణమని చెప్పొచ్చు. ఇదిలా ఉండగా.. ‘గాడ్ ఫాదర్’ కథ సత్యదేవ్ గురించి మార్చారు అంటూ సినిమా రిలీజ్ అయ్యాక ప్రచారం జరిగింది. ఇన్సైడ్ టాక్ ప్రకారం అది నిజమే అనేవారు కూడా లేకపోలేదు. సత్యదేవ్ ను ఈ చిత్రం కోసం తీసుకున్నది చిరంజీవి తమ్ముడి పాత్ర కోసమట. ఒరిజినల్ లో టోవినో థామస్ చేసిన పాత్ర అది.
తెలుగులో మాత్రం ఆ పాత్రని లేపేశారు. అయితే ‘లూసిఫర్’ ప్రాజెక్టు కోసం సత్యదేవ్ ఎంట్రీ ఇచ్చింది ఈ పాత్ర కోసమే..! విలన్ వివేక్ ఒబెరాయ్ పాత్రకు గాను మొదట అరవింద్ స్వామిని సంప్రదించారు. కానీ అతను వేరే ప్రాజెక్టుతో బిజీగా ఉండడంతో ఈ ఆఫర్ కు నొ చెప్పాడట. అలాగే టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ ను కూడా ఈ పాత్ర కోసం సంప్రదించినట్లు వినికిడి.
కానీ హీరోగా ఇంకా రాణిస్తున్న టైంలో విలన్ గా చేయడం అతనికి ఇష్టం లేక తప్పుకున్నట్టు తెలుస్తుంది. ఇక యంగ్ హీరోలు ఎవ్వరూ ఈ పాత్రకు ఇంట్రెస్ట్ చూపకపోవడంతో సత్యదేవ్ పాత్రని మార్చేసి విలన్ గా ప్రెజంట్ చేశారట. మరి ఈ మార్పులు అతని కెరీర్ కు ఎంత వరకు ఉపయోగపడతాయో చూడాలి..!