Vijay Devarakonda: 2026లో విజయ్ ‘R’ మీదనే ఫోకస్ చేశాడా? జీవితంలోకి వరుస Rలు
- January 29, 2026 / 02:40 PM ISTByFilmy Focus Desk
విజయ్ దేవరకొండ జీవితంలో 2026 చాలా కీలకంగా మారబోతోంది. ఎందుకంటే ఈ సంవత్సరం ఆయన పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్‌లో మార్పులు రాబోతున్నాయి. రాబోయే మార్పులన్నీ R చుట్టూనే తిరుగుతున్నాయి అంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఆయా అంశాల పేర్లు అన్నీ Rతోనే స్టార్ట్ కాబోతున్నాయి. కావాలంటే మీరే చూసుకోండి. తొలుత పర్సనల్ లైఫ్ గురించి చూద్దాం. విజయ్ టీమ్ బయటకు ఇచ్చిన రూమర్స్ ప్రకారం చూస్తే ఈ ఏడాది ఫిబ్రవరిలో విజయ్ దేవరకొండ – రష్మిక మందన పెళ్లి జరగబోతోంది.
Vijay Devarakonda
అలా తన లైఫ్‌లోకి ఓ R ని తీసుకురాబోతున్నాడు విజయ్. వీరి పెళ్లి రాజస్థాన్‌లో జరగబోతోంది అని సమాచారం. రాజస్థాన్ పేరు స్టార్ట్ అయ్యేది Rతోనే. ఇక వృత్తిగత జీవితంలోకి వస్తే రెండు సినిమాలు ఈ ఏడాది చేయబోతున్నాడు విజయ్. ఆ రెండూ ఈ సంవత్సరంలోనే రిలీజ్ అవుతాయి అని చెబుతున్నారు. ఆ సినిమా పేర్లు ‘రౌడీ జనార్ధన’, ‘రణబాలి’. ఈ రెండు టైటిల్స్ ఏ లెటర్‌తో స్టార్ట్ అవుతున్నాయో మీకు అర్థమయ్యే ఉంటుంది.

ఇక్కడే ఇంకో విషయం ఉంది. ఈ రెండు సినిమాలను తెరకెక్కించబోయేది దర్శకులు రవికిరణ్ కోలా, రాహుల్ సాంకృత్యాన్. పేర్లు చెప్పగానే మీకు విషయం అర్థమైపోయుంటుంది. అన్నట్లు ఈ రెండు సినిమాల నిర్మాతల పేర్లు కూడా R అనే అక్షరంతోనే స్టార్ట్ అవుతాయి. ఇలా ఎటు చూసినా 2026లో విజయ్ లైఫ్ అంతా R చుట్టూనే తిరుగుతుంది. చూద్దాం మరి ఆయనకు ఈ లెటర్ ఎంతవరకు లక్ ఇస్తుందో. ఇదేంటి ఇలాంటి సెంటిమెంట్లు కూడా ఉంటాయా అని మీరు అనుకోవచ్చు. ఇండస్ట్రీలో ఇలాంటివన్నీ సాధ్యమే.
ఇక్కడో విషయం ఉంది ఇప్పటివరకు విజయ్ R అనే అక్షరంతో స్టార్టయ్యే టైటిల్‌తో సినిమానే చేయలేదు. ఇప్పుడే చేస్తున్నాడు. ఇక సినిమాలో పాత్ర పేరు సంగతి చూస్తే.. Rishi అని తొలి సినిమాలో చేశాడు. మంచి పేరే సంపాదించాడు.











