బాలీవుడ్ పై ఏ హీరో ఏమన్నారో మీకు తెలుసా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో చాలామంది స్టార్ హీరోలు ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నారు. బాహుబలి సిరీస్ సినిమాలతో ప్రభాస్ కు బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు దక్కింది. ఆర్ఆర్ఆర్ సక్సెస్ తో చరణ్, తారక్ బాలీవుడ్ ఆడియన్స్ కు చేరువయ్యారు. పుష్ప ది రైజ్ తో హిందీలో రాజమౌళి సపోర్ట్ లేకుండానే బన్నీకి పాన్ ఇండియా హీరోగా మంచి గుర్తింపు దక్కింది. అయితే బాలీవుడ్ ఎంట్రీకి సంబంధించి ఒక్కో స్టార్ హీరో ఒక్కో విధంగా స్పందించడం గమనార్హం.

సర్కారు వారి పాట సినిమాతో మరో కమర్షియల్ సక్సెస్ ను ఖాతాలో వేసుకున్న మహేష్ బాబు తను నిర్మాతగా తెరకెక్కిన మేజర్ సినిమా ఈవెంట్ లో మాట్లాడుతూ హిందీ నుంచి నాకు చాలా ఆఫర్లు వచ్చాయని వెల్లడించారు. అయితే బాలీవుడ్ తనను భరించదని నమ్ముతున్నానని బాలీవుడ్ లో సినిమాలు చేసి టైమ్ వృథా చేసుకోవాలని అనుకోవట్లేదని మహేష్ తెలిపారు. కేజీఎఫ్, కేజీఎఫ్2 సినిమాలతో బాలీవుడ్ ఇండస్ట్రీలో సత్తా చాటిన యశ్ మాట్లాడుతూ

సౌత్ సినిమాల డబ్బింగ్ వెర్షన్లు కొన్ని హిందీ ఛానెళ్లలో ప్రసారమవుతున్నాయని సౌత్ సినిమాలు ఎలా ఉంటాయో బాలీవుడ్ ప్రేక్షకులను తెలుసని గత కొన్నేళ్లుగా సౌత్ సినిమాలు చూస్తుండటంతో ఆ కథలు బాగా నచ్చాయని యశ్ చెప్పుకొచ్చారు. హిందీ ప్రేక్షకులు దక్షిణాది సినిమాలను ఆదరిస్తున్నారని యశ్ తెలిపారు. బన్నీ మాట్లాడుతూ బాలీవుడ్ నుంచి ఆఫర్లు వస్తున్నా అవి ఆసక్తికరంగా లేవని ఇతర ఇండస్ట్రీలలో నటించడానికి ధైర్యం కావాలని విలన్ పాత్రలు చేయడం కష్టమని వాటిపై ఆసక్తి చూపించనని తెలిపారు.

చరణ్ మాట్లాడుతూ బాలీవుడ్ డైరెక్టర్లతో పని చేయాలని భావిస్తున్నానని అయితే సౌత్ ప్రేక్షకులకు నచ్చేలా బాలీవుడ్ మేకర్స్ సినిమాలను తెరకెక్కించాలని అన్నారు. ప్రభాస్ మాట్లాడుతూ ఏ సినిమా ఎలా కలెక్షన్లను సాధిస్తుందో చెప్పలేమని భవిష్యత్తులో అన్ని భాషల నుంచి పాన్ ఇండియా సినిమాలు వస్తాయని కామెంట్లు చేశారు.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహేష్ బాబు 26 సినిమాలు.. మరియు వాటి బాక్సాఫీస్ కలెక్షన్లు..!
‘భద్ర’ టు ‘అఖండ’.. బోయపాటి డైరెక్ట్ చేసిన సినిమాల కలెక్షన్లు..!
‘దూకుడు’ టు ‘సర్కారు వారి పాట’.. ఓవర్సీస్ లో మహేష్ బాబు 1 మిలియన్ మూవీస్ లిస్ట్..!

Share.