ఇప్పుడు వచ్చే సినిమాలు టాక్ బాగోకపోతే వీకెండ్ కి మించి బాక్సాఫీస్ వద్ద పెర్ఫార్మ్ చేయడం లేదు. ఎంతో కొంత బెటర్ టాక్ వస్తేనో.. లేదంటే వరుసగా సెలవులు ఉన్న టైంలో మాత్రమే… కొన్ని సినిమాలు మంచి వసూళ్లు సాధిస్తున్నాయి. ఇలాంటి అడ్వాంటేజ్..లు కనుక లేకపోతే.. ఎంత పాన్ ఇండియా సినిమా అయినా వీకెండ్..కు మించి పెర్ఫార్మ్ చేయడం లేదు. ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’ ‘ఆదిపురుష్’ చిత్రాలను ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇవి కాకుండా.. కొన్ని పాన్ ఇండియా సినిమాలు టాక్ తో సంబంధం లేకుండా మొదటి వారం భారీ ఓపెనింగ్స్ ను సాధించాయి.
ఆ లిస్ట్ లోకి ఇటీవల రిలీజ్ అయిన ‘దేవర’ కూడా చేరింది. ఇక లేట్ చేయకుండా.. ‘దేవర’ టాప్ 10 లో ఏ ప్లేసులో ఉందో తెలుసుకుందాం రండి :
1) బాహుబలి 2 : ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో హ్యాట్రిక్ మూవీగా రూపొందిన ఈ పాన్ ఇండియా చిత్రం.. మొదటి వారం వరల్డ్ వైడ్ రూ.428 కోట్లు షేర్ ను రాబట్టి.. ఇప్పటికీ నెంబర్ 1 ప్లేస్ లో ట్రెండ్ అవుతుంది.
2) ఆర్.ఆర్.ఆర్ : రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రాంచరణ్..లు హీరోలుగా తెరకెక్కిన ఈ పాన్ ఇండియా చిత్రం మొదటి వారం వరల్డ్ వైడ్ గా రూ.391.47 కోట్లు షేర్ ను రాబట్టింది.
3) కల్కి 2898 ad : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా చిత్రం మొదటి వారం వరల్డ్ వైడ్ గా రూ.337.54 కోట్లు షేర్ ను రాబట్టి.. నాన్- రాజమౌళి రికార్డ్స్ ను నమోదు చేసింది.
4) సలార్ : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా చిత్రం వరల్డ్ వైడ్ గా మొదటి వారం రూ.268.47 కోట్లు షేర్ ను రాబట్టింది.
5)సాహో : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా చిత్రం మొదటి వారం వరల్డ్ వైడ్ గా రూ.196.76 కోట్లు షేర్ ను రాబట్టి రికార్డులు సృష్టించింది.
6) ‘దేవర’ : ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా చిత్రం మొదటి వారం వరల్డ్ వైడ్ గా రూ.186.21 కోట్లు షేర్ ను రాబట్టింది.
7) ఆదిపురుష్ : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మైథలాజికల్ పాన్ ఇండియా మూవీ.. మొదటి వారం వరల్డ్ వైడ్ గా రూ.178.45 కోట్లు షేర్ ను రాబట్టింది.
8) బాహుబలి(ది బిగినింగ్) : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ‘ఛత్రపతి’ తర్వాత తెరకెక్కిన ఈ పాన్ ఇండియా చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.122.5 కోట్లు షేర్ ను రాబట్టింది.
9) సైరా : మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా చిత్రం మొదటి వారం వరల్డ్ వైడ్ గా రూ.107.78 కోట్లు షేర్ ను రాబట్టింది.
10) పుష్ప(పుష్ప ది రైజ్) : అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ‘ఆర్య’ ‘ఆర్య 2’ వంటి చిత్రాల తర్వాత తెరకెక్కిన ఈ పాన్ ఇండియా చిత్రం మొదటి వారం వరల్డ్ వైడ్ గా రూ.105.35 కోట్లు షేర్ ను రాబట్టింది.