Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Featured Stories » ‘టాప్ గేర్’ సినిమా టెక్నికల్‌గా అద్భుతం.. యంగ్ అండ్ లవ్‌లీ హీరో ఆది సాయి కుమార్

‘టాప్ గేర్’ సినిమా టెక్నికల్‌గా అద్భుతం.. యంగ్ అండ్ లవ్‌లీ హీరో ఆది సాయి కుమార్

  • December 27, 2022 / 07:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘టాప్ గేర్’ సినిమా టెక్నికల్‌గా అద్భుతం.. యంగ్ అండ్ లవ్‌లీ హీరో ఆది సాయి కుమార్

యంగ్ అండ్ లవ్‌లీ హీరో ఆది సాయి కుమార్ వరుస సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఇప్పుడు ‘టాప్ గేర్’ వేసి మరో యాక్షన్ థ్రిల్లర్ మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. కె. శశికాంత్ దర్శకత్వంలో K. V. శ్రీధర్ రెడ్డి నిర్మాణ సారథ్యంలో ఈ టాప్ గేర్ సినిమా తెరకెక్కింది. ఆదిత్య మూవీస్ & ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ పై సర్వ హంగులతో ఈ సినిమాను రూపొందించారు. ఈ చిత్రం డిసెంబర్ 30న విడుదల కాబోతున్న సందర్భంగా ఆది సాయి కుమార్ బుధవారం నాడు మీడియాతో ముచ్చటించారు. ఆయన చెప్పిన విశేషాలివే..

ఒకే ఏడాది మూడు సినిమాలు వచ్చాయి.. దీనిపై మీ స్పందన ఏంటి?
కరోనా వల్ల అన్ని సినిమాలు ఆలస్యమయ్యాయి. అందుకే అన్నీ ఒకే సారి వస్తున్నాయి. ఇక సమ్మర్ సీజన్‌లో పెద్ద సినిమాలు రావడంతో డేట్స్ అడ్జస్ట్ అవ్వలేదు. చిన్న సినిమాలకు ప్రస్తుతం డేట్స్ దొరకడం కష్టంగా మారింది. అందుకే ఈ ఏడాదిలో నా నుంచి మూడు చిత్రాలు వచ్చాయి.

టాప్ గేర్ సినిమా కథలో ఏ అంశం నచ్చింది? సినిమాను ఎందుకు ఎంచుకున్నారు?
టాప్ గేర్ కథ నాకు బాగా నచ్చింది. క్యాబ్ డ్రైవర్‌.. అతని జీవితంలో చిన్న సమస్య.. అది పెద్దగా మారడం.. ఒక్క రోజులో ఈ కథ జరుగుతుంది.. మా టీం అందరికీ ఈ కథ నచ్చింది. అందుకే ఈ సినిమాను చేశాం.

టాప్ గేర్ టైటిల్‌ ఆసక్తికరంగా ఉంది. ఈ ఆలోచన ఎవరిది?
టాప్ గేర్‌ అనే టైటిల్‌ను ముందుగా అనుకోలేదు. కానీ హీరో కారెక్టర్ మాత్రం టాప్ గేర్‌లోనే ఉంటుంది. హీరో టాప్ గేర్ వేయాల్సి వస్తుంది. ఒకసారి టాప్ గేర్ అని అనుకున్నాం. చాలా స్టైలిష్ ‌గా ఉందని ఆ టైటిల్‌ను ఫిక్స్ చేశాం.

టాప్ గేర్ డైరెక్టర్‌తో పని చేయడం ఎలా అనిపించింది?
డైరెక్టర్ శశికాంత్ చూస్తే ఓ ప్రొఫెసర్‌లా ఉంటారు. కానీ చాలా క్లారిటీతో ఉంటాడు. సీనియర్ డీఓపీ సాయి శ్రీరామ్ కి కూడా ఆ షాట్ అలా తీద్దాం ఇలా తీద్దామని చెబుతుండేవాడు. చాలా క్లారిటీతో ఉండేవాడు. ఎడిటర్ ప్రవీణ్ పూడి సైతం కంటెంట్ చాలా బాగుందని, బాగా తీశారని అన్నాడు.

టాప్ గేర్ పూర్తిగా సస్పెన్స్ థ్రిల్లర్‌గా సాగుతుందా?
టాప్ గేర్ అనేది కంప్లీట్ సస్పెన్స్ థ్రిల్లర్ ఏమీ కాదు. ఓ కుర్రాడు తనకు సంబంధం లేని చిక్కుల్లో ఇరుక్కుంటే ఏం అవుతుంది.. దాన్నుంచి ఎలా బయటపడతాడు అనేది చూపిస్తాం. ఐడియా కొత్తగా ఉంటే నేను సినిమాలను ఎంచుకుంటాను. ఐడియా బాగుంటే సగం సినిమా హిట్ అయినట్టే. మిగతాది అంతా స్క్రీన్ ప్లేలో ఉంటుంది. అయినా జనాలకు ఇప్పుడు ఏది నచ్చుతుందనేది అంచనా వేయలేకపోతున్నాం.

పూర్తి మాస్ సినిమాలు చేయాలని అభిమానులు కోరుతుంటారు. మరి ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారా?
ఇప్పుడు మాస్ స్టోరీలంటే అర్థం మారింది. కేజీయఫ్ సినిమా వచ్చి అంతా మార్చేసింది. అలాంటి సినిమాలే ఇప్పుడు మాస్‌కు నచ్చుతున్నాయి. ఇప్పుడు చేస్తే అలాంటి సినిమానే చేస్తాను. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలను చేయను.

టాప్ గేర్ సినిమాలో ఫైట్స్ కీలకంగా మారేలా ఉన్నాయి. ఫైట్ మాస్టర్‌ గురించి చెప్పండి?
రొమాంటిక్ సినిమాతో ఫైట్ మాస్టర్ పృథ్వీకి మంచి బ్రేక్ వచ్చింది. ఎంతో సహజంగా ఫైట్‌లను కంపోజ్ చేస్తుంటాడు. ఫైట్‌లో కూడా కథను చెప్పాలని చూస్తాడు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. తెల్లవారుఝామున నాలుగు గంటలకు ఓ సీన్ చేశాం. ఆ టైంలో యాక్సిడెంట్‌ కూడా జరిగింది. ఈ సినిమా కోసం యాక్షన్ సీక్వెన్స్‌ అంతా కూడా రాత్రే షూటింగ్ చేశాం.

టాప్ గేర్ సినిమాకు కారు కీలకంగా మారుతున్నట్టుంది?ప్రత్యేకంగా కారుని డిజైన్ చేశారా?
టాప్ గేర్ సినిమా అంతా కూడా కారులోనే ఉంటుంది. కాబట్టి మా ఆర్ట్ డైరెక్టర్, సినిమాటోగ్రఫర్ ఆ విషయంంలో కాంప్రమైజ్ అవ్వలేదు. చాలా బాగా డిజైన్ చేశారు. ఇందులో నేను క్యాబ్ డ్రైవర్ పాత్రలో కనిపిస్తాను. కానీ కథలో ఓ భాగంగానే ఆ పాత్ర ఉంటుంది.

ఈ సినిమాకు మ్యూజిక్, ఆర్ఆర్ ప్రాముఖ్యత ఎంత ఉంటుంది?
టాప్ గేర్ సినిమాకు ఆర్ఆర్ చాలా ముఖ్యం. హర్షవర్దన్ రామేశ్వర్ మాకు అద్భుతంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. ఆయన అంతకు ముందు ఆర్జున్ రెడ్డి చేశాడు. ప్రస్తుతం రవితేజ రావణాసుర, యానిమల్ సినిమాలు చేస్తున్నాడు. టాప్ గేర్ సినిమా బాగుందని ఆయన కూడా అన్నారు. సినిమాలో ఒకే ఒక్క పాట ఉంటుంది.

కొత్త కథలు, ప్రయోగాలు చేసేందుకు ఆసక్తిగానే ఉన్నారా?.. ప్రస్తుతం చేస్తున్న సినిమా సంగతులు ఏంటి?
కొత్త కథలు చేయాలని, ప్రయోగాలు చేయాలని ఉంటుంది. ప్రస్తుతం నేను ఒక వెబ్ సిరీస్‌ చేస్తున్నాను. జీ5 కోసం నేను చేయబోతున్న వెబ్ సిరీస్‌లో ఎవ్వరూ ఊహించనటువంటి పాత్రను పోషిస్తున్నాను. కానీ నా వద్దకు వచ్చే కథలన్నీ కమర్షియల్ యాంగిల్‌లోనే ఉంటాయి. కానీ నాకు రియలిస్టిక్ సినిమాలు చేయాలని ఉంటుంది.

నెగెటివ్ రోల్స్ ఏమైనా చేస్తారా? ఆ దిశగా ఏమైనా ఆఫర్లు వచ్చాయా?
నెగెటివ్ రోల్స్‌ ఆఫర్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు హీరోగా మంచి చిత్రాలు చేస్తున్నాను. ఇప్పుడు అన్నీ కూడా చకాచకా చిత్రాలు చేసేయాలని అనుకుంటున్నాను.

టాప్ గేర్ సినిమా ఎలా ఉండబోతోంది?
టాప్ గేర్ సినిమా టెక్నికల్‌గా బాగుంటుంది. మ్యూజిక్, కెమెరా వర్క్ అద్భుతంగా ఉంటాయి.

భవిష్యత్ సినిమాల గురించి చెప్పండి?
నేను ప్రస్తుతం లక్కీ మీడియాకు ఓ సినిమా చేస్తున్నాను. జీ5 కోసం చేసిన వెబ్ సిరీస్ షూటింగ్ అయిపోయింది. వచ్చే నెలలో ప్రమోషన్స్ మొదలుపెడతారు. సినిమాకు తక్కువ కాకుండా ఉంటుంది. మొదటి సీజన్‌లో ఎనిమిది ఎపిసోడ్‌లు ఉంటాయి.

హీరోయిన్‌ రియాతో పని చేసిన అనుభవం ఎలా ఉంది?
రియాకు నాకు సీన్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఆమె ప్రస్తుతం తమిళంలో బిజీగా ఉన్నారు. నయనతార ప్రొడక్షన్ కంపెనీలో సినిమా చేస్తోంది. ఆమెతో పని చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రంలో చక్కగా నటించింది.

టాప్ గేర్ సినిమాను ఇతర భాషల్లోనూ రిలీజ్ చేస్తున్నారా?
టాప్ గేర్ సినిమాను కేవలం తెలుగులోనే రిలీజ్ చేస్తున్నాం. హిందీలో డబ్ చేస్తున్నాం. గరం సినిమాతో నార్త్‌లో బాగానే క్రేజ్ వచ్చింది. లవ్ లీ, ఆపరేషన్ గోల్డ్ ఫిష్ హిందీ ఆడియెన్స్‌ను బాగానే ఆకట్టుకున్నాయి.

మీ మాస్ ఇమేజ్‌ను చూసి నిర్మాతలు ముందుకు వస్తున్నారా? కంటెంట్ చూసి వస్తుంటారా?
మంచి కంటెంట్‌ ఉంటేనే నిర్మాతలు ముందుకు వస్తారు. నా ప్రతీ సినిమా టెక్నికల్‌గా బాగా ఉంటుంది. నా చిత్రాలు ఓటీటీలోనూ బాగానే ఆడుతుంటాయి. కొన్ని పరిస్థితుల వల్ల థియేటర్లో సరిగ్గా ఆడలేదు. శశి సినిమాకు థియేటర్లో ఓపెనింగ్స్ వచ్చాయి. ఓటీటీలో బాగా ఆడింది. క్రేజీ ఫెల్లో సినిమా కూడా ఓటీటీలో బాగా ఆడింది.

మీ నాన్న గారి సినిమాలైనా, పాటల్లో ఏదైనా రీమేక్ చేయాలని అనుకుంటున్నారా?
నాన్న గారి పాటను రీమేక్ చేయాలని ఉంది. ‘అసలేం గుర్తుకురాదు’ అనే పాటను రీమేక్ చేయాలని ఉంది. కానీ ఆ సిట్యువేషన్ పడాలి. అయితే ఆ సాంగ్‌ను రీమేక్ చేస్తే మళ్లీ కృష్ణవంశీ గారే తీయాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #aadhi sai kumar
  • #Top Gear

Also Read

Tejaswini: పవన్ కళ్యాణ్ పై దిల్ రాజు భార్య ఆసక్తికర వ్యాఖ్యలు!

Tejaswini: పవన్ కళ్యాణ్ పై దిల్ రాజు భార్య ఆసక్తికర వ్యాఖ్యలు!

Court Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కోర్ట్’

Court Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కోర్ట్’

Pawan Kalyan: నటి వాసుకి దీనస్థితికి స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం!

Pawan Kalyan: నటి వాసుకి దీనస్థితికి స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం!

Nithiin, Dil Raju: నువ్వు కోల్పోయింది అదే.. నితిన్ మొహంపైనే చెప్పేసిన దిల్ రాజు..!

Nithiin, Dil Raju: నువ్వు కోల్పోయింది అదే.. నితిన్ మొహంపైనే చెప్పేసిన దిల్ రాజు..!

Ram Charan: ‘గేమ్ ఛేంజర్’ రిజల్ట్ తో ఆ గిల్ట్ మాకు ఎక్కువగా ఉంది: దిల్ రాజు

Ram Charan: ‘గేమ్ ఛేంజర్’ రిజల్ట్ తో ఆ గిల్ట్ మాకు ఎక్కువగా ఉంది: దిల్ రాజు

Sirish: ‘గేమ్‌ ఛేంజర్‌’ డిజాస్టర్‌.. హీరో కనీసం ఫోన్‌ కూడా చేయలేదన్న నిర్మాత.. ఏమైందంటే?

Sirish: ‘గేమ్‌ ఛేంజర్‌’ డిజాస్టర్‌.. హీరో కనీసం ఫోన్‌ కూడా చేయలేదన్న నిర్మాత.. ఏమైందంటే?

related news

Chiranjeevi: బుల్లిరాజుపై చిరుకి అంత నమ్మకం ఏంటి..?

Chiranjeevi: బుల్లిరాజుపై చిరుకి అంత నమ్మకం ఏంటి..?

Tejaswini: పవన్ కళ్యాణ్ పై దిల్ రాజు భార్య ఆసక్తికర వ్యాఖ్యలు!

Tejaswini: పవన్ కళ్యాణ్ పై దిల్ రాజు భార్య ఆసక్తికర వ్యాఖ్యలు!

Court Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కోర్ట్’

Court Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కోర్ట్’

Pawan Kalyan: నటి వాసుకి దీనస్థితికి స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం!

Pawan Kalyan: నటి వాసుకి దీనస్థితికి స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం!

BV Pattabhiram: ప్రముఖ నటుడు, మెజీషియన్‌ బీవీ పట్టాభిరామ్‌ కన్నుమూత!

BV Pattabhiram: ప్రముఖ నటుడు, మెజీషియన్‌ బీవీ పట్టాభిరామ్‌ కన్నుమూత!

Jr NTR: ప్రశాంత్ నీల్ పై ఎన్టీఆర్ ఒత్తిడి.. ఏమైంది?

Jr NTR: ప్రశాంత్ నీల్ పై ఎన్టీఆర్ ఒత్తిడి.. ఏమైంది?

trending news

Tejaswini: పవన్ కళ్యాణ్ పై దిల్ రాజు భార్య ఆసక్తికర వ్యాఖ్యలు!

Tejaswini: పవన్ కళ్యాణ్ పై దిల్ రాజు భార్య ఆసక్తికర వ్యాఖ్యలు!

2 hours ago
Court Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కోర్ట్’

Court Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కోర్ట్’

2 hours ago
Pawan Kalyan: నటి వాసుకి దీనస్థితికి స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం!

Pawan Kalyan: నటి వాసుకి దీనస్థితికి స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం!

3 hours ago
Nithiin, Dil Raju: నువ్వు కోల్పోయింది అదే.. నితిన్ మొహంపైనే చెప్పేసిన దిల్ రాజు..!

Nithiin, Dil Raju: నువ్వు కోల్పోయింది అదే.. నితిన్ మొహంపైనే చెప్పేసిన దిల్ రాజు..!

5 hours ago
Ram Charan: ‘గేమ్ ఛేంజర్’ రిజల్ట్ తో ఆ గిల్ట్ మాకు ఎక్కువగా ఉంది: దిల్ రాజు

Ram Charan: ‘గేమ్ ఛేంజర్’ రిజల్ట్ తో ఆ గిల్ట్ మాకు ఎక్కువగా ఉంది: దిల్ రాజు

7 hours ago

latest news

Dil Raju: ‘దిల్’ టైటిల్ వెనుక ఉన్న సీక్రెట్ బయటపెట్టిన దిల్ రాజు!

Dil Raju: ‘దిల్’ టైటిల్ వెనుక ఉన్న సీక్రెట్ బయటపెట్టిన దిల్ రాజు!

4 hours ago
Dilruba Collections: డిజాస్టర్ గా మిగిలిపోయిన ‘దిల్ రూబా’..!

Dilruba Collections: డిజాస్టర్ గా మిగిలిపోయిన ‘దిల్ రూబా’..!

5 hours ago
Kevvu Kartheek Family: భార్యతో కలిసి ఆలయంలో సందడి చేసిన కెవ్వు కార్తీక్.. ఫోటోలు వైరల్!

Kevvu Kartheek Family: భార్యతో కలిసి ఆలయంలో సందడి చేసిన కెవ్వు కార్తీక్.. ఫోటోలు వైరల్!

5 hours ago
Mohanlal: ప్రశాంత్ వర్మ ప్లానింగ్ మామూలుగా లేదుగా..!

Mohanlal: ప్రశాంత్ వర్మ ప్లానింగ్ మామూలుగా లేదుగా..!

7 hours ago
Rukmini Vasanth: ఇంకా హిట్టు పడలేదు.. కానీ డిమాండ్ మామూలుగా లేదు..!

Rukmini Vasanth: ఇంకా హిట్టు పడలేదు.. కానీ డిమాండ్ మామూలుగా లేదు..!

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version