Trinadha Rao Nakkina: త్రినాధ్ రావ్ స్పీడ్ బాగానే ఉంది..!
- February 28, 2025 / 04:55 PM ISTByPhani Kumar
త్రినాథ్ రావ్ నక్కిన (Trinadha Rao Nakkina ) టాలీవుడ్లో సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న దర్శకుల్లో ఒకరు. ‘మేం వయసుకు వచ్చాం’ నుండి చూసుకుంటే ‘సినిమా చూపిస్తా మావ’ (Cinema Chupista Maava) ‘నేను లోకల్’ (Nenu Local) ‘హలో గురు ప్రేమ కోసమే’ (Hello Guru Prema Kosame) ‘ధమాకా’ (Dhamaka) .. ఇలా ఆయన తీసిన సినిమాలు మ్యాగ్జిమమ్ హిట్ అయ్యాయి. తాజాగా ‘మజాకా’ (Mazaka) అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనికి జస్ట్ ఓకే రిపోర్ట్స్ వస్తున్నాయి. బాక్సాఫీస్ వద్ద బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే వచ్చాయి.
Trinadha Rao Nakkina

ఫ్రైడే రిలీజ్ అయ్యుంటే.. కమర్షియల్ లెక్కలు వేరేగా ఉండేవేమో. ఇప్పటికైతే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద గట్టెక్కడం కష్టంగానే కనిపిస్తుంది. అయితే దీని రిజల్ట్ తో సంబంధం లేకుండా త్రినాథ్ రావ్ నక్కిన డిమాండ్ పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం దిల్ రాజు (Dil Raju), మైత్రి మూవీ మేకర్స్ వారి వద్ద అడ్వాన్సులు తీసుకుని పెద్ద ప్రాజెక్టులు సెట్ చేసుకునే పనిలో ఉన్నారు త్రినాథ్ రావ్ నక్కిన. ఈ క్రమంలో బెల్లంకొండ శ్రీనివాస్ కి (Bellamkonda Sai Sreenivas) ఒక కథ వినిపించారు అనే టాక్ ఉంది.

ఆ కథ బెల్లంకొండకి నచ్చినట్టు కూడా తెలుస్తుంది. కానీ ఇప్పుడు అతను 4 ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్నాడు.. కాబట్టి, ఇప్పట్లో బెల్లంకొండ శ్రీనివాస్ తో సినిమా చేయడం కష్టం. మరోపక్క రవితేజతో కూడా త్రినాథ్ రావ్ నక్కిన సంప్రదింపులు జరిగాయి. రవితేజ (Ravi Teja) అయితే ‘మాస్ జాతర’ (Mass Jathara) ఫినిష్ అయిన వెంటనే త్రినాథ్ రావ్ నక్కినతో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ ఇద్దరిలో ఎవరితో త్రినాధ్ రావ్ నెక్స్ట్ సినిమా ఉంటుంది అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది. కానీ ఇద్దరిలో ఒకరితో కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి.












