పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం ‘ది రాజాసాబ్'(The Rajasaab) సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు. దీనితో పాటు ‘ఫౌజీ’ లో కూడా సమాంతరంగా నటిస్తున్నాడు. ఇవి 2 పూర్తయిన వెంటనే ‘స్పిరిట్’ (Spirit) షూటింగ్లో జాయిన్ అవుతాడు. ఈ సినిమా చేస్తున్నప్పుడు ప్రభాస్ మరో సినిమా చేయడానికి ఉండదు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) పెట్టిన కండిషన్ అది. సందీప్ కి ఏం కావాలో ఒక క్లారిటీ ఉంటుంది. దాని విషయంలో అస్సలు తగ్గడు. స్టార్లని సైతం లెక్కచేయడు.
ఇటీవల ‘స్పిరిట్’ (Spirit) నుండి హీరోయిన్ దీపికా పదుకోనెని (Deepika Padukone) అతను తీసేసినట్టు వార్తలు వచ్చాయి. ఆమె స్థానంలో కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత్ ను (Rukmini Vasanth) తీసుకున్నట్టుగా కూడా ప్రచారం జరిగింది. దీనిపై క్లారిటీ రావడానికి మరింత టైం పడుతుంది అని అంతా అనుకున్నారు. కానీ కట్ చేస్తే.. వెంటనే క్లారిటీ ఇచ్చేశాడు సందీప్. క్లారిటీ మాత్రమే కాదు ప్రభాస్ అభిమానులకు పెద్ద షాకిచ్చాడు అని కూడా చెప్పాలి. విషయం ఏంటంటే.. ‘స్పిరిట్’ సినిమాలో హీరోయిన్ గా త్రిప్తి డిమ్రిని (Tripti Dimri) తీసుకున్నాడట.
ఈ విషయాన్ని ఓ పోస్టర్ ద్వారా కన్ఫర్మ్ చేశాడు. అన్ని భాషల్లోనూ త్రిప్తి పేరును రాసి.. తన స్టైల్లో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. అయితే త్రిప్తి ఎంట్రీని డైజెస్ట్ చేసుకోవడానికి ప్రభాస్ ఫ్యాన్స్ కి టైం పట్టొచ్చు. ఎందుకంటే.. ‘యానిమల్’ (Animal) సినిమాలో ఆమె బోల్డ్ రోల్లో కనిపించింది. పైగా సెకండ్ హీరోయిన్ టైపు రోల్ అది. ‘సెకండ్ హీరోయిన్ ను తెచ్చి ప్రభాస్ వంటి స్టార్ పక్కన పెట్టడం అనేది’ సందీప్ స్టైల్ బోల్డ్ డెసిషన్. బట్ అతనికి కావాల్సిన దాని విషయంలో అయితే అతను కాంప్రమైజ్ అయ్యే రకం కాదు.