టాలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్లు ఉన్నంత వరకు పాన్ ఇండియా హీరోలు బిజీగా ఉండటం పరమ సహజం. కానీ ఇప్పుడు పరిస్థితి మరీ క్లిష్టంగా మారింది. రామ్ చరణ్ (Ram Charan) , ఎన్టీఆర్ (Jr NTR) , అల్లు అర్జున్ (Allu Arjun), ప్రభాస్ (Prabhas) లాంటి స్టార్ హీరోలందరూ వరుస సినిమాలతో పూర్తిగా బిజీగా ఉండటంతో… వారి తదుపరి చిత్రాల కోసం సుకుమార్ (Sukumar), కొరటాల శివ (Koratala Siva), త్రివిక్రమ్ (Trivikram), సందీప్ వంగా (Sandeep Reddy Vanga), నాగ అశ్విన్ (Nag Ashwin) లాంటి టాప్ డైరెక్టర్లు తమ ప్రాజెక్ట్స్‌ను వాయిదా వేయాల్సిన పరిస్థితిలో పడిపోయారు.
సుకుమార్ ఇప్పటికే ఆర్సీ17గా రామ్ చరణ్‌తో సినిమా ప్రకటించాడు. పుష్ప 2 (Pushpa 2) తర్వాత ఈ సినిమా పట్టాలెక్కాలని భావించినా, చరణ్ ‘పెద్ధి’తో (Peddi) బిజీగా ఉండటంతో… ఈ ప్రాజెక్ట్ వాయిదా పడింది. దీంతో సుకుమార్‌కు 2026 వరకూ వెయిట్ తప్పదు. ఇదే పరిస్థితి కొరటాల శివకి కూడా. దేవర (Devara) తర్వాత దేవర 2ని తారక్‌తో చేయాలని ఫిక్స్ అయినా… ఎన్టీఆర్ ఇప్పుడు వార్ 2 (War 2), డ్రాగన్ లాంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉండటంతో కోరటాల కూడా 2026 వరకూ ఎదురుచూడాల్సిందే.
ఇక దాదాపు ఇదే రూట్‌లో ఉన్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram). బన్నీతో ఓ సినిమా అనౌన్స్ చేసిన త్రివిక్రమ్‌కు ఊహించని షాక్ తగిలింది. అట్లీ డైరెక్షన్‌లో బన్నీ ఓ భారీ పాన్ వరల్డ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కి కమిట్ కావడంతో, త్రివిక్రమ్ ప్రాజెక్ట్‌కి కొంతకాలం బ్రేక్ పడింది. బన్నీ – అట్లీ (Atlee Kumar) సినిమా 2026 వరకు సాగే అవకాశముండటంతో త్రివిక్రమ్ ప్రాజెక్ట్ వెనక్కి వెళ్లే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా, ‘స్పిరిట్’ (Spirit) సినిమాతో ప్రభాస్‌తో పని చేయబోయే సందీప్ రెడ్డి వంగా కూడా ఇప్పుడు డార్లింగ్ డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నాడు.
ప్రస్తుతానికి ప్రభాస్ ‘పౌజీ’, ‘రాజా సాబ్’ (The Raja saab) షూటింగ్లతో బిజీగా ఉండటంతో, స్పిరిట్‌కి లైన్ క్లియర్ కావాలంటే ఇంకొంత సమయం పట్టేలా ఉంది. ఇదే పరిస్థితి కల్కి 2898 AD (Kalki 2898 AD) దర్శకుడు నాగ్ అశ్విన్‌కి కూడా. ‘కల్కి 2’ ప్లాన్ ముందుకు సాగాలంటే ప్రభాస్ ఫ్రీ అయ్యే వరకు వాయిదా తప్పదు. మొత్తంగా చూస్తే, స్టార్ డైరెక్టర్లకు డేట్లు సెట్ చేసుకోవడం కన్నా, హీరోలు ఖాళీ అయ్యే వరకు ఎదురుచూడాల్సిన ఈ పరిస్థితి టాలీవుడ్ ట్రెండ్‌లో ఒక రకమైన ‘వెయిటింగ్ గేమ్’ మొదలైందని చెప్పొచ్చు.