Pawan Kalyan: పవన్ కోసం మరోసారి రంగంలోకి త్రివిక్రమ్!
- October 21, 2024 / 08:49 PM ISTByFilmy Focus
ఏపీ ఉపముఖ్యమంత్రిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) .. బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎంత బిజీగా ఉన్నారో అందరికీ తెలిసిందే. వరుస కార్యక్రమాలతో తీరిక లేకుండా గడుపుతున్నారు. సినిమాల్లోనే కాదు.. పాలిటిక్స్ లో కూడా తన మార్క్ ను చూపిస్తున్నారు. అయితే ఇప్పటికే తన చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ ను వీలైనంత త్వరగా కంప్లీట్ చేస్తానని చెప్పిన పవన్.. ఇప్పుడు టైమ్ కేటాయిస్తున్నారు. ఇటీవల హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu) మూవీ షూటింగ్ స్టార్ట్ అయింది.
Pawan Kalyan

పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఆ మూవీ షూటింగ్ నవంబర్ 10వ తేదీ నాటికి పూర్తి కానున్నట్లు సమాచారం. మరోవైపు.. సాహో (Saaho) ఫేమ్ సుజిత్ (Sujeeth) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓజీ షూటింగ్ కూడా హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీ లో జరుగుతోంది. రీసెంట్ పవన్ కూడా ఓజీ (OG Movie) సెట్స్ లోకి అడుగు పెట్టినట్లు తెలుస్తోంది. హరి హర వీరమల్లు, ఓజీ కంప్లీట్ అయ్యాక.. ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) సినిమా షూటింగ్ ను పవన్ మొదలుపెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇప్పటికే డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) .. ప్లాన్ వేసినట్లు ప్రచారం సాగుతోంది. ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram) .. పవన్ కోసం ఇప్పుడు రెండు ప్రాజెక్టులను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అందులో ఒకటి స్ట్రెయిట్ మూవీ కాగా.. మరొకటి రీమేక్ ఉన్నట్లు సమాచారం. తక్కువ టైమ్ లోనే షూటింగ్ ను పూర్తి చేసేందుకు త్రివిక్రమ్ ప్లాన్స్ వేసినట్లు.. వార్తలు వినిపిస్తున్నాయి. స్క్రిప్ట్ లు ఫైనల్ అయ్యాక.. ప్రొడ్యూసర్ ను త్రివిక్రమ్ ఫిక్స్ చేయనున్నారట.

అయితే ఇంతకుముందు.. తన సినీ కెరీర్ విషయంపై పవన్ కళ్యాణ్ ఓసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ముందు తన చేతిలో ప్రాజెక్టులు పూర్తి చేస్తానని తెలిపారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత.. పూర్తిస్థాయి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు తెలిపారు. ఫ్యూచర్ లో సినిమాలు చేస్తానో లేదో అన్న విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడు త్రివిక్రమ్.. రెండు ప్రాజెక్టులు రెడీ చేస్తున్నారని వార్తలు రావడంతో పవన్ అప్ కమింగ్ చిత్రాలపై డిస్కషన్ జరుగుతోంది.

















