ఎన్టీఆర్, రాంచరణ్ లు హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం భారీ అంచనాల మధ్య ఈ ఏడాది మార్చి 25న విడుదలైన సంగతి తెలిసిందే. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రం ‘బాహుబలి'(సిరీస్) లానే పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అయ్యింది. ‘బాహుబలి’ రికార్డులను అయితే ఈ మూవీ బ్రేక్ చేయలేదు కానీ.. తెలుగు వెర్షన్ పరంగా మాత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. హిందీలో అయితే ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’ పీక్స్ లో కలెక్ట్ చేయగా ఆ స్థాయిలో ‘ఆర్.ఆర్.ఆర్’ కలెక్ట్ చేయలేకపోయింది.
అయితే ఓటీటీలో రిలీజ్ అయ్యాక ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా గుర్తింపు లభించింది. హాలీవుడ్ క్రిటిక్స్ సైతం ఈ మూవీ అద్భుతం అంటూ ట్వీట్లు వేశారు. రాంచరణ్, ఎన్టీఆర్ లను ఓ రేంజ్లో పొగిడేశారు. 14 వారాల పాటు ‘ఆర్.ఆర్.ఆర్’ ట్రెండింగ్ లో నిలిచింది. ఇదిలా ఉండగా.. ఈ మధ్యనే ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం టెలివిజన్ ప్రీమియర్ స్టార్ మా లో టెలికాస్ట్ అయ్యింది. ఆగస్టు 14న టీవీల్లో టెలికాస్ట్ అయిన ‘ఆర్.ఆర్.ఆర్’ …
మొదటిసారి 19.62 టి.ఆర్.పి రేటింగ్ ను నమోదు చేసింది. ఇది మంచి టి.ఆర్.పి రేటింగే అయినప్పటికీ ఎన్టీఆర్, చరణ్ వంటి ఇద్దరు స్టార్ హీరోలు ఉన్నప్పుడు ఇంత తక్కువ రేటింగ్ నమోదు చేయడం ఏంటి అని అంతా వాపోతున్నారు. అల్లు అర్జున్- సుకుమార్ ల ‘పుష్ప’ చిత్రం మొదటి సారి స్టార్ మా లో టెలికాస్ట్ అయినప్పుడు 22.54 టి.ఆర్.పి రేటింగ్ ను నమోదు చేసింది.
అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురములో’ అయితే మొదటి సారి జెమినీ టీవీలో టెలికాస్ట్ అయినప్పటికీ 29.4 టి.ఆర్.పి రేటింగ్ ను నమోదు చేసింది. ‘ఆర్.ఆర్.ఆర్’ అల్లు అర్జున్ చిత్రాల కంటే తక్కువ టి.ఆర్.పి రేటింగ్ ను రాబట్టడం షాకిచ్చే అంశం.