‘ఉషాకిరణ్ మూవీస్’ బ్యానర్ పై రామోజీరావు నిర్మాతగా తేజ డైరెక్షన్లో తెరకెక్కిన సినిమా ‘చిత్రం’. ఉదయ్ కిరణ్, రీమా సేన్.. జంటగా నటించిన ఈ చిత్రం అప్పట్లో పెద్ద హిట్ అయ్యింది. ఈ చిత్రంతో హీరోగా పరిచయమైన ఉదయ్ కిరణ్.. తరువాత ‘నువ్వు నేను’ ‘మనసంతా నువ్వే’ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్లు కొట్టి స్టార్ హీరో అయిపోయాడు. ఎటువంటి స్టార్ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్ గా ఎదిగిన ఉదయ్ కిరణ్… ఆ తరువాత ‘కలుసుకోవాలని’ ‘శ్రీరామ్’ ‘నీ స్నేహం’ వంటి చిత్రాలతో కూడా పర్వాలేదు అనిపించాడు.
అయితే ఆ తరువాత నుండీ ఇతని డౌన్ ఫాల్ స్టార్ట్ అయ్యింది. అతను చేసిన సినిమాలన్నీ ప్లాప్ అయ్యాయి. ఆ తరువాత అవకాశాలు రావడం కూడా తగ్గిపోయాయి. పర్సనల్ లైఫ్ కూడా డిస్టర్బ్ అయ్యింది. దాంతో 2014లో అతను ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయాడు. సరే ఇదంతా పక్కన పెడితే.. తన మొదటి చిత్రానికి గాను ఉదయ్ కిరణ్ తీసుకున్న పారితోషికం ఎంతో చాలా మందికి తెలీదు. డైరెక్టర్ తేజ ఈ విషయం పై క్లారిటీ ఇచ్చాడు.
‘చిత్రం’ సినిమాకి గాను నిర్మాత రామోజీరావు.. అందులో నటించిన వారికొక్కరికీ 11 వేలు చొప్పున పారితోషికం ఇచ్చాడని చెప్పుకొచ్చాడు. మొత్తంగా ఆ ‘చిత్రం’ ను 31 రోజుల్లో ఫినిష్ అయ్యిందని.. 30 లక్షల బడ్జెట్ లోపే ఆ ప్రాజెక్ట్ ను తెరకెక్కించినట్టు చెప్పుకొచ్చాడు.