నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హీరోగా వి.వి.వినాయక్ (V. V. Vinayak) దర్శకత్వంలో తెరకెక్కిన ‘చెన్నకేశవరెడ్డి’ (Chennakesava Reddy) చిత్రం అందరికీ గుర్తుండే ఉంటుంది. ‘ఆది’ (Aadi) తో బ్లాక్ బస్టర్ కొట్టిన వినాయక్, ఫ్యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయినటువంటి బాలకృష్ణ కాంబినేషన్లో సినిమా అంటే.. అంచనాలు ఏ రేంజ్లో ఏర్పడతాయి. ‘చెన్నకేశవరెడ్డి’ చిత్రంపై కూడా అంచనాలు అదే రేంజ్లో ఏర్పడ్డాయి. కానీ వాటిని పూర్తిస్థాయిలో అందుకోలేకపోయింది ఈ సినిమా.
Chennakesava Reddy
అలా అని నిరాశపరిచిన సినిమా అనడానికి లేదు. బాక్సాఫీస్ వద్ద సేఫ్ అయిన సినిమానే. కానీ ఆల్ టైం రికార్డులు క్రియేట్ చేసింది లేదు. ఈ సినిమాలో కొన్ని సీన్స్ ఇప్పటికీ ప్రేక్షకుల మైండ్లో మెదులుతూనే ఉంటాయి. నేటితో ‘చెన్నకేశవరెడ్డి’ రిలీజ్ అయ్యి 22 ఏళ్ళు పూర్తి కావస్తోంది. ఈ సందర్భంగా ‘చెన్నకేశవరెడ్డి’ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం పదండి :
1) ‘ఆది’ సూపర్ హిట్ అయ్యాక వినాయక్ కి చాలా మంది నిర్మాతల నుండి అడ్వాన్స్..లు అందాయి. కానీ అతనితో ఫస్ట్ సినిమా చేసిన నిర్మాత బెల్లంకొండ సురేష్..కే సినిమా చేసి ఆయనకు లాభాలు వచ్చేలా చేసి ఋణం తీర్చుకోవాలని దర్శకుడు వినాయక్ అనుకున్నారు. బెల్లంకొండ సురేష్ (Bellamkonda Suresh) వద్ద బాలకృష్ణ కాల్ షీట్లు ఉండటంతో వెంటనే అన్నీ సెట్ అయిపోయాయి. ప్రాజెక్టు కూడా త్వరగానే స్టార్ట్ అయిపోయింది.
2) వాస్తవానికి ‘ఆది’ కంటే ముందుగా ‘చెన్నకేశవరెడ్డి’ కథనే రాసుకున్నాడట వినాయక్. ‘ఫ్యాక్షన్ ఫ్యామిలీకి చెందిన అన్నదమ్ములు. వాళ్లిద్దరూ పారిపోతున్న టైంలో తమ్ముడిని కాపాడటానికి అన్న బాంబులు వేయడం.. తర్వాత ఆ తమ్ముడిని ట్రైన్ ఎక్కించి పంపించేయడం, పెద్దయ్యాక ఆ తమ్ముడు పోలీస్ అయ్యి సీమకి వచ్చి.. ఒకసారి అన్నని అరెస్ట్ చేయాలనుకోవడం.. ఆ టైంలో సుమోలు పేలే ఎపిసోడ్’ ఇలా కథ రాసుకున్నాడట వినాయక్. కానీ ముందుగా ఎన్టీఆర్ తో సినిమా చేసే ఛాన్స్ రావడంతో అదే కథని విడగొట్టి.. లేయర్స్ అన్నీ మార్చేసి.. ‘ఆది’ ‘చెన్నకేశవరెడ్డి’ సినిమాలు తీశాడట.
3) ‘చెన్నకేశవరెడ్డి’ సినిమా కథకి కమల్ హాసన్ (Kamal Haasan) ‘ఖైదీ వేట’ సినిమా కూడా స్ఫూర్తి అని తెలుస్తుంది.
4) ‘చెన్నకేశవరెడ్డి’ లో టబు(Tabu) పాత్ర కోసం ముందుగా సౌందర్యని (Soundarya) సంప్రదించారట. కానీ ఆమె ఎందుకో నో చెప్పడంతో టబుని తీసుకున్నారట.
5) అలాగే ఈ సినిమాలో చెల్లెలి పాత్ర చాలా కీలకం. దానికోసం ముందుగా లయ (Laya) ..ని సంప్రదించారట. కానీ ఆమె ఎమోషనల్ అయ్యి.. ‘హీరోయిన్ గా పనికిరామా మేము.. ఎందుకు చెల్లెలి పాత్రలే ఆఫర్ చేస్తారు’ అనడంతో వినాయక్ కూడా ఆమె కామెంట్స్ కి ఏకీభవించి తిరిగి వచ్చేశాడట.
6)ఫ్యాక్షన్ కథలకి.. ఆ రోజుల్లో రైటర్ పరుచూరి గోపాలకృష్ణ (Paruchuri Gopala Krishna) పర్ఫెక్ట్ అనే వారు. అయితే ‘చెన్నకేశవరెడ్డి’ చిత్రానికి ఆయన సోదరుడు పరుచూరి వెంకటేశ్వరరావు (Paruchuri Venkateswara Rao) ఎక్కువగా పనిచేశారట. గోపాలకృష్ణ రైటర్ అయితే కనుక ఫలితం ఇంకోలా ఉండేది అంటూ వినాయక్ ఓ సందర్భంలో చెప్పారు.
7)ఈ సినిమాలో హెలికాప్టర్ షార్ట్ ఒకటి ఉంటుంది. అది బాలయ్య డూప్ లేకుండా చేశారట.
8) సినిమాలో భూమిలో నుండి సుమోలు పైకి లేచే సీన్ ఉంటుంది. ఆ రోజుల్లో టెక్నాలజీ పెద్దగా అందుబాటులో లేదు. ఆ సీన్..ని ఒరిజినల్ గా షూట్ చేశారట.
9)’చెన్నకేశవరెడ్డి’ చిత్రం షూటింగ్ 67 రోజుల పాటు జరిగిందట. అంటే 70 రోజుల్లో సినిమా కంప్లీట్ అయిపోయిందట.
10)బాలకృష్ణ కెరీర్లో ఆ టైంకి హయ్యెస్ట్ బడ్జెట్ తో రూపొందిన సినిమా ఇది.థియేట్రికల్ బిజినెస్ కూడా ఎక్కువే జరిగిందట.
11) ‘చెన్నకేశవరెడ్డి’ చిత్రం 2002 సెప్టెంబర్ 25న రిలీజ్ అయ్యింది. ఆ టైంకి ‘ఇంద్ర’ (Indra) (జూలై 24న) సక్సెస్ ఫుల్..గా రన్ అవుతుంది.
అయినప్పటికీ 158 కేంద్రాల్లో 50 రోజులు ఆడింది ‘చెన్నకేశవరెడ్డి’. (ఆల్ టైం రికార్డ్), 38 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది.
బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రూ.16 కోట్ల వరకు షేర్ ను రాబట్టింది. రీ రిలీజ్లో కూడా సత్తా చాటింది.