Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Focus » Sardaar Gabbar Singh: 9 ఏళ్ళ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గురించి 10 ఆసక్తికర విషయాలు!

Sardaar Gabbar Singh: 9 ఏళ్ళ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గురించి 10 ఆసక్తికర విషయాలు!

  • April 8, 2025 / 04:44 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sardaar Gabbar Singh: 9 ఏళ్ళ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గురించి 10 ఆసక్తికర విషయాలు!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కెరీర్లో ‘గబ్బర్ సింగ్’ (Gabbar Singh) సినిమా చాలా స్పెషల్. దాదాపు 10 ఏళ్ళ పాటు సరైన హిట్టు లేని పవన్ కళ్యాణ్ కి.. పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చి ఆదుకున్న సినిమా ఇది. ముఖ్యంగా పవన్ అభిమానుల ఆకలి తీర్చింది అని చెప్పాలి. హిందీలో సూపర్ హిట్ అయిన ‘దబాంగ్’ కి రీమేక్ గా ఈ సినిమా రూపొందింది. అయినప్పటికీ దర్శకుడు హరీష్ శంకర్ (Harish Shankar) తెలుగు నేటివిటీకి తగ్గట్టు చాలా మార్పులు చేశారు. అలాంటి చిత్రానికి సీక్వెల్ గా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ (Sardaar Gabbar Singh) వచ్చింది. అయితే ఇది రీమేక్ కాదు. దర్శకుడు కూడా హరీష్ కాదు. బాబీ (K. S. Ravindra) డైరెక్ట్ చేశాడు. ‘ఈరోజ్ ఇంటర్నేషనల్’ ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ ‘నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్’ సంస్థల పై శరత్ మరార్ (Sharrath Marar), సునీల్ లుల్లా, పవన్ కళ్యాణ్..లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. 2016 ఏప్రిల్ 8 న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. నేటితో ఈ సినిమా వచ్చి 9 ఏళ్ళు పూర్తి కావస్తోంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద ప్లాప్. అయితే ఈ సినిమా గురించి చాలా మందికి తెలియని కొన్ని విషయాలను ఇప్పుడు ఓ లుక్కేద్దాం రండి :

Sardaar Gabbar Singh

1) పవన్ కళ్యాణ్ 23 వ సినిమాగా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ (Sardaar Gabbar Singh) మొదలైంది. ముందుగా ఈ చిత్రానికి దర్శకుడిగా సంపత్ నంది (Sampath Nandi) ఎంపికయ్యాడు. పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. కానీ కొన్ని కారణాల వల్ల సంపత్ నంది ఈ ప్రాజెక్టు నుండి తప్పుకున్నాడు. దీంతో దాదాపు ఏడాది పాటు ఈ ప్రాజెక్టు హోల్డ్ లో పడింది. ఈ లోపు పవన్ కళ్యాణ్ ‘ఓ మై గాడ్’ రీమేక్ అయిన ‘గోపాల గోపాల’ ని (Gopala Gopala) కంప్లీట్ చేశారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Pawan Kalyan: స్కూల్లో అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న పవన్ తనయుడు మార్క్ శంకర్!
  • 2 'జాక్' తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న సినిమాలు!
  • 3 పెద్ది.. అప్పుడే నేషనల్ అవార్డు అంటున్నారే..!

2) పవన్ ‘గోపాల గోపాల’ షూటింగ్లో ఉన్నప్పుడే రవితేజ (Ravi Teja) ‘పవర్’ (Power) సినిమా రిలీజ్ అయ్యింది. బాబీ కొల్లి ఆ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఆ సినిమాని బాబీ తీసిన విధానం పవన్ కళ్యాణ్ కి బాగా నచ్చింది. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ప్రాజెక్టు కోసం పవన్ సరైన దర్శకుడి కోసం ఎదురుచూస్తున్న టైంలో రైటర్ కోన వెంకట్ సలహా మేరకు బాబీని పిలిచి మాట్లాడారు పవన్ కళ్యాణ్.

3) ‘సర్దార్ గబ్బర్ సింగ్’ కథ, స్క్రీన్ ప్లే.. రెండూ కూడా పవన్ కళ్యాణ్ డిజైన్ చేసిందే. కానీ పవన్ ఇమేజ్ కి తగ్గట్టు బుర్రా సాయి మాధవ్ తో (Sai Madhav Burra) కలిసి కొన్ని డైలాగ్స్ బాబీ డిజైన్ చేయించుకున్నారు. ఆ తర్వాత వెంటనే సెట్స్ పైకి వెళ్ళిపోయింది ఈ సినిమా.

4) ఈ సినిమాలో పవన్ సరసన జోడీగా అనీష అంబ్రోస్ ను ( Anisha Ambrose) అనుకున్నారు. కానీ లుక్ టెస్ట్ చేసినప్పుడు ఆమె సెట్ అవ్వలేదు అని భావించి పక్కన పెట్టారు. తర్వాత ఆమె ప్లేస్లో కాజల్ అగర్వాల్ ను (Kajal Aggarwal) తీసుకున్నారు.

5) ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమాని 94 రోజుల్లోనే కంప్లీట్ చేశారు. కానీ పవన్ కళ్యాణ్ ‘జనసేన’ పార్టీ మీటింగుల వల్ల.. షూటింగ్ డిలే అయ్యింది. 2014 చివర్లో సెట్స్ పైకి వెళ్లిన ఈ సినిమా 2016 వరకు ఆలస్యమవుతూ వచ్చింది.

6) సంగీత దర్శకుడిగా ముందు తమన్ ను (S.S.Thaman)  తీసుకోవాలి అని అనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్… సూచన మేరకు దేవి శ్రీ ప్రసాద్ నే ఫైనల్ చేశారు. ఈ సినిమాలో దేవి ప్రసాద్ (Devi Sri Prasad) కంపోజ్ చేసిన పాటలు అన్నీ చార్ట్ బస్టర్స్ అయ్యాయి. టైటిల్ సాంగ్, ‘ఓ పిల్లా’ వంటి పాటలు చాలా బాగుంటాయి.

7) ‘సర్దార్ గబ్బర్ సింగ్’ క్లైమాక్స్ లో పవన్ కళ్యాణ్ ‘ఇంద్ర’ (Indra) సినిమాలో చిరంజీవి (Chiranjeevi) చేసిన వీణ స్టెప్ వేయడం విశేషంగా చెప్పుకోవాలి.

8) ఈ సినిమా కోసం ముందుగా పవన్ కళ్యాణ్ ఎటువంటి రెమ్యునరేషన్ తీసుకోలేదు. నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించారు. తర్వాత బిజినెస్ ద్వారా వచ్చిన లాభాల్లో వాటా తీసుకున్నారు. ఆ రకంగా పవన్ కి రూ.30 కోట్ల వరకు పారితోషికం అందింది.

9) కానీ రిలీజ్ తర్వాత సినిమా డిజాస్టర్ అవ్వడం.. బయ్యర్స్ కి నష్టాలు రావడంతో, రూ.15 కోట్ల వరకు పవన్ కళ్యాణ్ వెనక్కి ఇవ్వడం జరిగింది.

10) ‘సర్దార్ గబ్బర్ సింగ్’ మొదటి రోజు ఆంధ్రలో రూ.15 కోట్ల(గ్రాస్) ను కలెక్ట్ చేసి ఆల్ టైం రికార్డులు సృష్టించింది. దీనికి ముందు ‘బాహుబలి'(ది బిగినింగ్) (Baahubali) చిత్రం రూ.14.2 కోట్లు(గ్రాస్) ను కలెక్ట్ చేసింది. మొదటి రోజు ఆంధ్రాలో ‘బాహుబలి’ రికార్డుని ‘సర్దార్ గబ్బర్ సింగ్’ బ్రేక్ చేసినట్టు అయ్యింది. పవన్ కళ్యాణ్ స్టార్ ఇమేజ్ కి మాత్రమే సాధ్యమైన రికార్డు ఇది చెప్పడంలో అతిశయోక్తి లేదు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #K. S. Ravindra
  • #pawan kalyan
  • #Sardaar Gabbar Singh

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

5 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

6 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

6 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

7 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

10 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 days ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version